డి.హీరేహళ్లో వైఎస్ జగన్కు ఘనస్వాగతం | Grand welcome to YS Jagan in D.Hirehal | Sakshi
Sakshi News home page

డి.హీరేహళ్లో వైఎస్ జగన్కు ఘనస్వాగతం

Published Sun, May 17 2015 6:14 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

డి.హీరేహళ్లో వైఎస్ జగన్కు ఘనస్వాగతం - Sakshi

డి.హీరేహళ్లో వైఎస్ జగన్కు ఘనస్వాగతం

అనంతపురం: ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి డి.హీరేహళ్లో ఘనస్వాగతం లభించింది. ఏడవ రోజు రైతు భరోసా యాత్రలో భాగంగా ఆదివారం సాయంత్రం ఆయన ఇక్కడకు చేరుకున్నారు. ఆయన వస్తున్నారని తెలిసి పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. డి.హీరేహళ్లో ఆత్మహత్య చేసుకున్న ఈరన్న కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. అన్నివిధాల తాము అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు.

అంతకు ముందు దేవగిరి క్రాస్ వద్ద వ్యవసాయకూలీలు వైఎస్ జగన్ను కలిశారు. అక్కడ కొద్దిసేపు ఆగి జగన్ కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.  దేవగిరిలో నరసింహారావు కుటుంబాన్ని పరామర్శించారు. నాగులాపురంలో మారన్న, పూలకుర్తిలో రాముడు కుటుంబాలను ఆయన పరామర్శించారు. వారికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement