
రెండో రోజు వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర
అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్ర గురువారం రెండో రోజు కొనసాగనుంది. ధర్మవరం నియోజవర్గంలోని కొత్తపేట, శాంతినగర్, శివనగర్ లలో వైఎస్ జగన్ పర్యటిస్తారు. అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్న ఏడుగురు చేనేత కార్మికుల కుటుంబాలను ఆయన పరామర్శిస్తారు. ధర్మవరం రైల్వేస్టేషన్ వద్ద చేనేత కార్మికులతో వైఎస్ జగన్ ముఖాముఖి కానున్నారు.