'ఆయన కనిపిస్తే రైతులు రాళ్లతో కొట్టేలా ఉన్నారు' | farmers ready to throw stones on chandra babu, says ys jagan mohan reddy | Sakshi

'ఆయన కనిపిస్తే రైతులు రాళ్లతో కొట్టేలా ఉన్నారు'

Published Tue, Jul 21 2015 6:05 PM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM

'ఆయన కనిపిస్తే రైతులు రాళ్లతో కొట్టేలా ఉన్నారు' - Sakshi

'ఆయన కనిపిస్తే రైతులు రాళ్లతో కొట్టేలా ఉన్నారు'

చంద్రబాబు కనిపిస్తే రైతులు రాళ్లతో కొట్టేలా ఉన్నారని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు.

చంద్రబాబు కనిపిస్తే రైతులు రాళ్లతో కొట్టేలా ఉన్నారని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు చేపట్టిన మూడో విడత రైతు భరోసా యాత్రలో భాగంగా ఆయన శెట్టూరులో బహిరంగ సభలో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే...

  • రుణమాఫీపై అసెంబ్లీలో చంద్రబాబును నిలదీస్తే.. రైతులంతా సుఖ శాంతులతో ఉన్నారని చెప్పుకొచ్చారు.
  • తనకు సన్మానాలు చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకొన్నారు
  • కానీ ఇప్పుడు చంద్రబాబు కనిపిస్తే రైతులు రాళ్లతో కొట్టేట్లున్నారు
  • చంద్రబాబు చెప్పిన అబద్ధాల వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
  • గతంలో వడ్డీలేని రుణం వస్తే, ఇప్పుడు రైతులు 14 శాతం అపరాధ వడ్డీ కడుతున్నారు
  • రుణాలు రెన్యువల్ కాక, రైతులు పంటబీమా కూడా పొందలేని దుస్థితిలో ఉన్నారు
  • రూ. 2 వేల నిరుద్యోగ భృతి, డ్వాక్రా రుణమాఫీ విషయంలో అందరినీ మోసం చేస్తున్నారు
  • పుష్కరాల్లో సినిమా తీసేందుకు 29 మందిని బలి తీసుకున్నారు
  • పబ్లిసిటీ కోసం బాబు ఏమైనా చేస్తారు
  • గతంలో 200 రూపాయల వరకు వచ్చే కరెంటు బిల్లు కాస్తా ఇప్పుడు చంద్రబాబు పుణ్యమాని 800 రూపాయలు వస్తోంది
  • జూన్ 30 నాటికి వ్యవసాయ రుణాలు ఇవ్వాల్సి ఉంటే, ఇప్పటివరకు సహకార బ్యాంకుల నుంచి ఒక్క రుణం కూడా ఇవ్వలేదు
  • చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చేలా.. ఆయన మెడలు వంచైనా గుర్తుచేస్తూనే ఉంటాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement