వైఎస్ జగన్ రైతులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు తమ కష్టాలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం బలవంతంగా, కారుచౌకగా తమ భూములను లాక్కొందని తమ పరిస్థితి ఏంటంటూ రైతులు గోడు వెళ్లబోసుకున్నారు. వారు ఏమన్నారో వాళ్ల మాటల్లోనే...
వైఎస్ చేతుల మీదుగా పట్టా తీసుకున్నా
మాకు 15 ఎకరాలు ఉంది. నలుగురు అన్నదమ్ములున్నారు. ఒక్కొక్కరికి మూడు, నాలుగు ఎకరాల చొప్పున భూమి వచ్చింది. 50 సంవత్సరాల నుంచి మా మామగారి కాలం నుంచి ఈ భూముల్లో సాగు చేస్తున్నాం. ఈ భూములకు సంబంధించి పత్రాలు, పన్నులు చెల్లించిన పేపర్లు ఉన్నాయి. అప్పులు చేసుకుని బోర్లు వేశాం, కరెంట్ వేశాం. దివంగత వైఎస్ఆర్ కాలంలో మాకు పట్టాలు ఇచ్చారు. వైఎస్ఆర్ నుంచి నేనే స్వయంగా పట్టా తీసుకున్నా. నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. ఏడాదికి రెండు, మూడు పంటలు పండుతాయి. మాకు సెంటు భూమి కూడా లేకుండా మొత్తం తీసేసుకున్నారు. మేం ఇవ్వమన్నా అధికారులు నోటీసులు పంపుతున్నారు. సోలార్ ప్రాజెక్టులో మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు పట్టించుకోవడం లేదు. సెంటు భూమి లేదు. మేం ఎట్లా బతికేది? పరిహారం కూడా పూర్తిగా ఇవ్వలేదు. అడిగితే ఇస్తామని సంవత్సరం నుంచి చెబుతున్నారు. చంద్రబాబు గారు దయచేసి మా కన్నీళ్లు తుడవండి, మా పిల్లల భవిష్యత్ మీ చేతుల్లో ఉంది. దయచేసి మమ్మల్ని ఆదుకోండి.
-అమ్మాజాన్
పరిహారం కూడా ఇవ్వలేదు
నాకు నాలుగు ఎకరాలు సాగుభూమి ఉంది. ఇవ్వనన్నా భూములను బలవంతంగా లాక్కున్నారు. వరి, వేరుశెనగ పంటలు పండిస్తాం. బోరు, పైపులైన్లు ఉన్నాయి. మాకు ఈ భూమే ఆదరవు. ఇది తప్ప వేరే ఏమీ లేవు. మా భూము లాక్కొని మమ్మల్ని రోడ్డుపై నిలబెట్టారు. తక్కువ ధరలకు భూములు తీసుకున్నారు. పరిహారం కూడా ఇవ్వలేదు. మేం బతికేది ఎట్లా?
-హైదర్ అలీ
మామిడిచెట్లకు పరిహారం ఇవ్వరట
మా నాయన 10 ఎకరాలు సంపాదించాడు. కేరళ, ముంబై వెళ్లి ఎన్నో కష్టాలు పడి ఐదు బోర్లు వేసుకున్నాం. బోర్లు ఉన్నాయి. నీళ్లు వస్తున్నాయి. మామిడి చెట్లు పెంచాం. పంటకు వస్తున్నాయి. బోర్లకు డబ్బులు ఇస్తామన్నారు. మామిడి చెట్లకు ఇవ్వమని చెప్పారు. ఇష్టంలేకున్నా భూములు తీసుకున్నారు. నోటీసులు ఇచ్చారు. కానీ పరిహారం ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇప్పడు నా పరిస్థితి ఏమిటి?
-బాబు జాన్
వైఎస్ పట్టా ఇచ్చారు.. బాబు భూమి లాక్కున్నారు
Published Sat, Jun 4 2016 1:04 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
Advertisement
Advertisement