
21 నుంచి ‘అనంత’లో జగన్ రైతు భరోసా యాత్ర
సాక్షి, హైదరాబాద్: గడచిన ఏడాది కాలంలో అప్పులబాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి మొదలుపెట్టిన ‘రైతు భరోసా యాత్ర’ మూడో విడత పర్యటనను ఈ నెల 21 నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలో అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శిస్తారని పార్టీ పోగ్రాం కమిటీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఇప్పటికే వైఎస్ జగన్ రెండు విడతలుగా అనంతపురం జిల్లాలోనే రైతు భరోసా యాత్ర నిర్వహించడం తెలిసిందే.