పాస్బుక్లు విసిరి పారేస్తున్నారు.. | YS Jagan mohan reddy interact with farmers, dwacra groups at anantapur district timmapuram | Sakshi
Sakshi News home page

పాస్బుక్లు విసిరి పారేస్తున్నారు..

Published Thu, May 14 2015 3:34 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

పాస్బుక్లు విసిరి పారేస్తున్నారు.. - Sakshi

పాస్బుక్లు విసిరి పారేస్తున్నారు..

అనంతపురం జిల్లాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర నాలుగోరోజు కొనసాగుతోంది.


అనంతపురం : అనంతపురం జిల్లాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర నాలుగోరోజు కొనసాగుతోంది. యాత్రలో భాగంగా ఆయన గురువారం తిమ్మాపురంలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు పుల్లయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబానికి వైఎస్ఆర్ సీపీ పార్టీ అన్నివిధాల అండగా ఉంటుందని ధైర్యాన్ని చెప్పారు.

అనంతరం రైతు, డ్వాక్రా సంఘాలతో వైఎస్ జగన్ ముఖాముఖీ అయ్యారు. ఈ సందర్భంగా రైతులు, డ్వాక్రా మహిళలు తమ సమస్యలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకు వచ్చారు.  తమకు రుణాలు మాఫీ కావటం లేదని రైతులు, డ్వాక్రా మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ  రైతులు చాలా కష్టాల్లో ఉన్నారని, డ్వాక్రా మహిళల పరిస్థితి దారుణంగా ఉందన్నారు.

రుణమాఫీ అంటూ చంద్రబాబు జనాల చెవుల్లో పువ్వులు పెట్టారని అన్నారు. ఏమీ తెలియని వారికి ఏ విషయం  అయినా చెప్పవచ్చని, అన్ని తెలిసిన కూడా చంద్రబాబు అబద్దాలు ఆడుతున్నారని వైఎస్ జగన్ అన్నారు. రైతుల పట్ల ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు వాగ్దానాలు చేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని వైఎస్ జగన్ మండిపడ్డారు. చంద్రబాబుకు విదేశాలపై ఉన్న మోజు ఏపీపై లేదని ఆయన విమర్శించారు.

కాగా రైతు, డ్వాక్రా రుణాల మాఫీ ఎక్కడా చేయలేదని, ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగం ఇవ్వలేదని, రైతులు, మహిళలకు కొత్త రుణం కూడా మంజూరు చేయలేదన్నారు.  రుణాల కోసం  బ్యాంక్లకు వెళితే అధికారులు పాస్బుక్లు విసిరి పారేస్తున్నారని మహిళలు ఈ సందర్భంగా  వైఎస్ జగన్ కు మొరపెట్టుకున్నారు.

అంతకు ముందు నల్లదాసరిపల్లి గ్రామస్తులు తమ గ్రామంలో తాగునీటి సమస్య ఉందని వైఎస్ జగన్ దృష్టికి తీసుకు వెళ్లారు. తాగునీటి కోసం అల్లాడిపోతున్నామని, ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని నల్లదాసరిపల్లి గ్రామస్తులకు వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement