అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రెండో విడత రైతు భరోసా యాత్ర ముగిసింది.
అనంతపురం : అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రెండో విడత రైతు భరోసా యాత్ర ముగిసింది. వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర విజయవంతమైందని వైఎస్ఆర్ సీపీ నేత తలశిల రఘురాం తెలిపారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న 14 రైతు కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించినట్లు ఆయన పేర్కొన్నారు. సోమవారం తలశిల రఘురాం మీడియాతో మాట్లాడుతూ రాజకీయ కారణాలతో హత్యకు గురైన ముగ్గురు వైఎస్ఆర్ సీపీ నేతల కుటుంబాలను కూడా వైఎస్ జగన్ పరామర్శించినట్లు చెప్పారు.
రైతు భరోసా యాత్రలో భాగంగా వైఎస్ జగన్ 8 రోజుల్లో 1150 కిలోమీటర్ల ప్రయాణించారని, అనంతపురం, రాప్తాడు, సింగనమల, తాడిపత్రి, గుంతకల్లు, ఉరవకొండ, రాయదుర్గంలో వైఎస్ జగన్ పర్యటించినట్లు చెప్పారు.