వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్ర ఆదివారం నాటికి ఏడో రోజుకు చేరుకుంది.
అనంత:వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్ర ఆదివారం నాటికి ఏడో రోజుకు చేరుకుంది. దీనిలో భాగంగా ఈరోజు జగన్ రాయదుర్గం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. దేవగిరి, పూలకుర్తి, డి. హీరోహిల్ గ్రామాల్లో ఆయన పర్యటన కొనసాగనుంది. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు.