ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి, వారికి భరోసా కల్పించేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అనంతపురంలో చేపట్టిన ఐదోవిడత రైతు భరోసా యాత్ర నాలుగోరోజు శనివారం ఉదయం కదిరిలో ప్రారంభమైంది.
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి, వారికి భరోసా కల్పించేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో చేపట్టిన ఐదోవిడత రైతు భరోసా యాత్ర నాలుగోరోజు శనివారం ఉదయం కదిరిలో ప్రారంభమైంది.
అక్కడి నుంచి ఆయన గాండ్లపెంటకు చేరుకోగా... పజలు ఆయనకు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. అభిమానులకు వైఎస్ జగన్ అభివాదం చేశారు. అక్కడి నుంచి ఎన్‌పీ కుంట దిశగా సాగిపోయారు. ఎన్‌పీ కుంట మండలంలో సోలార్ విద్యుత్ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయి పరిహారం లభించని బాధిత రైతులతో జగన్ సమావేశం కానున్నారు.