
టాంజానియాలో కంటెంట్ క్రియేటర్ కలీపాల్ తన సోదరి నీల్‌పాల్‌తో కలిసి చేసిన డాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. రణ్‌వీర్ సింగ్, ఆలియా భట్ ‘రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని’ సినిమాలోని ‘ఝుమ్ఖా’ పాటకు కలీపాల్, నీమ్‌పాల్‌లు స్టెప్పులు వేశారు. తమ సంప్రదాయ దుస్తులు ధరించి చేసిన ఈ డ్యాన్స్ వీడియో 1.4 మిలియన్‌ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
► ఏ దేశమేగినా గానం నుంచి నృత్యం వరకు ఏదో ఒక రూపంలో దేశం మనతో ఉంటుంది. తాజాగా ఐకానిక్ వాషింగ్టన్ మాన్యుమెంట్ (యూఎస్) బ్యాక్‌గ్రౌండ్‌గా స్వాతి జయశంకర్ భరతనాట్యం చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో లక్షలాది వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ‘బ్యూటిఫుల్ బ్యాక్‌గ్రౌండ్ బ్యూటిఫుల్ డ్యాన్స్’ అంటూ కామెంట్ సెక్షన్ ప్రశంసలతో నిండిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment