అల్లు అర్జున్‌కు కేరళ ప్రభుత్వం ఆహ్వానం | Allu Arjun invited for Boat Race in Kerala | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 6 2018 12:12 PM | Last Updated on Wed, Apr 3 2019 5:24 PM

Allu Arjun invited for Boat Race in Kerala - Sakshi

అల్లు అర్జున్‌

కేరళ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్‌కు ముఖ్య అతిథిగా హాజరు కావ్వాల్సిందిగా స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ఈ పోటీలు ఈ నెల 10న అలప్పుల సమీపంలోని పున్నంద సరస్సులో జరగనున్నాయి. ఇక కేరళ ప్రభుత్వ ఆహ్వానంపై బన్నీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఇక బన్నీకి కేరళలో కూడా మంచి ఫాలోయింగ్‌ ఉన్న విషయం తెలిసిందే.

అతని సినిమాలు అక్కడ కూడా మంచి కలెక్షనను రాబడతాయి. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్‌ను కేరళ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఇక ఈ గౌరవం పొందిన తొలి టాలీవుడ్ హీరో బన్నీనే కావడం విశేషం. కాగా ఈ ఏడాది ‘నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’తో వచ్చిన బన్నీ.. తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement