గల్లంతైన మత్స ్యకారుల కుటుంబాలను పరామర్శిస్తున్న వైఎస్సార్‌సీపీ నేత గొల్ల బాబూరావు
విశాఖపట్నం , నక్కపల్లి/ఎస్‌రాయవరం (పాయకరావుపేట): కాకినాడ నుంచి ఈ నెల 10న వేటకు వెళ్లి పెథాయ్ తుపానుకు సముద్రంలో చిక్కుకున్న రేవుపోలవరం, వాడచీపురుపల్లికి చెందిన ఐదుగురు మత్య్సకారుల ఆచూకీ ఇంకా లభ్యంకా లేదు. స్థానికంగా వేట సాగకపోవడంతో రేవుపోలవరం గ్రామానికి చెందిన వాడబదుల ప్రసాద్, వాడబదుల కోటి, «వాడబదుల ధనరాజ్‌తోపాటు వాడచీపురుపల్లికి చెందిన మసేను, ప్రసాద్ కాకినాడకు వలసవెళ్లారు. అక్కడినుంచి ఈ నెల 10న మెకనైజ్డ్ బోటుపై యజమానితోపాటు కూలికోసం సముద్రంలో వేటకు వెళ్లారు. సుమారు 30 నాటికన్ మైళ్ల దూరంలో వేట సాగిస్తున్నారు. ఒక సారి వేటకు వెళ్తే పదిరోజుల వరకు తిరిగిరారని, పదిరోజులకు సరిపడా ఆహార సామగ్రి తీసుకెళ్తారని బంధువులు, తోటి మత్య్సకారులు చెప్పారు. అయితే ఈనెల 10న వేటకు బయలు దేరిన వీరికి పెథాయ్ తుపాను సమాచారం అందింది.
దీంతో వెనక్కి తిరిగి వచ్చే క్రమంలో సముద్రంలో అలల తాకిడికి వీరు ప్రయాణిస్తున్న బోటు గల్లంతయినట్లు స్థానికులకు సమాచారం అందింది. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో తాము సురక్షితంగానే ఉన్నామని.. కంగారు పడొద్దని.. ఒడ్డుకు చేరుకుంటామని కుటుంబ సభ్యులకు తోటి మత్య్సకారులకు సమాచారం ఇచ్చిన వీరి ఆచూకీ తర్వాత లభించలేదు. సోమవారం ఉద యం నుంచి తుపాను తీవ్రవాయుగుండంగా మా రి కాకినాడ సమీపంలో తీరం దాటింది. ఈ సమయంలో సముద్రంలో అలలు మూడు నుంచి నాలుగు మీటర్ల ఎత్తున ఎగసిపడ్డాయి. తిరుగు ప్రయాణంలో ఉన్న తమవారు ఏ రాత్రికైనా ఇళ్లకు చేరుకుంటారని ఆ«శపడ్డ ఆ కుటుంబాలకు నిరాశేఎదురైంది. మంగళవారం కూడా వీరి ఆచూకీ లభించలేదని కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు.
గల్లంతైన మత్య్సకారుల కోసం అధికారులకు ఫిర్యాదు చేశామని, కానీ ఎటువంటి సాయం అందలేదని, ఆచూకీ కనుగొ నడం కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆవేదన చెందుతున్నారు. గల్లంతైన వారు కేవలం వేటే ఆధారంగా కుటుంబాలను పోషిస్తున్నారు. మెకనైజ్డ్ బోట్లు, లైసెన్స్ కలిగిన ఇంజిన్ తెప్పలపై యజమానులతో పాటు, కూలికి వెళ్తుంటారు. ఒక్కో తెప్ప/ బోటులో ఆరునుంచి 8 మంది వెళ్తుంటారు. వీరు కాకినాడకు ఆరుమాసాల క్రితం వలస వెళ్లారు. ఈ నెలా ఖరుకు స్వగ్రామాలకు చేరుకోవాల్సి ఉంది. అయి తే తుపాను రావడంతో వీరంతా సముద్రంలో చిక్కుకోవడంతో ఏ పరిస్థితిలో ఉన్నారో, ఎక్కడ ఉన్నారోతెలియక భయాందోళన చెందుతున్నారు. కాకినాడ నుంచి కోస్ట్‌గార్డ్ సిబ్బందిని పంపించి ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆచూకీ కనుగొనడంలో ప్రభుత్వం వైఫల్యం
రేవుపోలవరం మత్య్సకారులు గల్లంతైన విష యం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్ల బాబూరావు ఆ గ్రామాన్ని సందర్శించి బంధువులతో మాట్లాడా రు. అక్కడి నుంచి కాకినాడ వెళ్లారు. గల్లంతైన వారి కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. అధైర్యపడొద్దని, తాను జిల్లా ఎస్పీతో మాట్లాడి గల్లంతైన వారిని సురక్షితంగా ఇళ్లకు తీసుకువచ్చేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఐదుగురు మత్య్సకారులు గల్లంతయి మూడ్రోజులు గడుస్తున్నా ఆచూకీ కనుగొనే విషయంలో ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోందని బాబూ రావు విమర్శించారు. కోస్ట్‌గార్డ్ సిబ్బందిని పంపించి సహాయ కార్యక్రమాలు చేపట్టడంకూడా ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. గల్లం తైన వారిలో కడు పేదలున్నారని, సొంత తెప్పలు లేకపోవడంతో కూలి కోసం బోట్లపై యజమానులతో కలసి వేటకు వెళ్లారని చెప్పారు. గల్లంతైనవారి కోసం కుటుంబీకులు ఎంతో ఆతృతతో ఎదు రు చూస్తున్నారని, ఇప్పటిౖMðనా ప్రభుత్వం స్పం దించి కోస్ట్ గార్డులను సముద్రంలోకి పంపించి వెతికించాలని కోరారు. జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీతో ఫోన్‌లో మాట్లాడి సహాయక కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. బాధిత కుటుంబా లకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment