కొనసాగుతున్న ఫైర్, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు
సాక్షి, రాజమహేంద్రవరం : తూర్పుగోదావరి జిల్లా పశువుల్లంకలో పడవ ప్రమాదం జరిగి రెండు రోజులు కావస్తున్నా గల్లంతైన విద్యార్థినుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. గల్లంతైన ఆ ఆరుగురు బాలికల కోసం అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇందుకోసం మూడంచెల గాలింపు చర్యలు చేపట్టారు. సెర్చ్ ఆపరేషన్‌లో 15టీములు పాల్గొన్నాయి.
ఈ సహాయక చర్యల్లో ఫైర్, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందితో పాటు నేవి హెలికాఫ్టర్‌తో అధికారుల సెర్చ్ ఆపరేషన్ నడుస్తోంది. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నప్పటికి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అధికారులు నిన్న రాత్రి గాలింపు చర్యల్లో లభ్యమైన గల్లా నాగమణి మృతదేహాన్ని స్వగ్రామం షేర్‌లంకకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.
పాండిచ్చేరి ప్రభుత్వం సహకరిస్తోంది
తూర్పుగోదావరి : గల్లంతైన విద్యార్థినుల ఆచూకీ కోసం చేస్తున్న సెర్చ్ ఆపరేషన్‌కు పాండిచ్చేరి ప్రభుత్వం సహకరిస్తోందని జిలా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. ఈ సెర్చ్ ఆపరేషన్‌లో మొత్తం 15టీములు పాల్గొన్నాయన్నారు. వర్షం లేకపోవటంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment