
భామిని: వంశధారలో నాటు పడవపై వెళ్తున్న ప్రయాణికులు
భామిని శ్రీకాకుళం : ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాలకు వారధిగా, తెలుగు–ఒడియా సంస్కృతుల సమ్మేళనానికి సహకరించేందుకు రథ సారధులు ప్రారంభమయ్యాయి. రెండు రాష్ట్రాల మధ్య ప్రవహిస్తున్న వంశధార నదిని దాటేందుకు పడవ ప్రయాణాలు గురువారం నుంచి ప్రారంభం కావడంతో పరీవాహక ప్రాంతాల ప్రజల రాకపోకలకు మార్గం సుగమమైంది.
మండలంలోని బత్తిలి నుంచి కీసర వరకు గల గ్రామాల ప్రజలు ప్రయాణాలు, వ్యాపారాలకు సమీపంలోని ఒడిశా గ్రామాలపై ఆధారపడి ఉన్నారు. అయితే... ఇటీవల వంశధారలో భారీగా వరదలు రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం ప్రవాహం తగ్గడంతో నాటు పడవల ప్రయాణాలు ప్రారంభమయ్యాయి. ఈతలో అనుభవజ్ఞులైన మత్స్యకారులే స్థానికంగా పడవలు నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకం. ప్రస్తుతం మండలంలోని బత్తిలి, నేరడి–బి, పసుకుడి, లివిరి, సొలికిరి, తాలాడ, తాలాడ రేవుల్లో పడవలు నడుపుతున్నారు.
మత్స్యకారులే సాయం
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కలపతో చెక్కిన కర్ర పడవుల స్థానంలో ఇసుప బోట్లు వచ్చాయి. వెదురు గెడల సాయంతో నడిపే విధానానికి ఫుల్‌స్టాప్ చెప్పి ఇంజిన్లు బిగించి పడవులు నడుపుతున్నారు. నదిలో వరద పెరిగినా అప్రమత్తంగా ఉండేందుకు ఇంజిన్లు సహకరిస్తున్నాయి. ఇటీవల మత్స్యశాఖ అందించిన బోటు కూడా నదిలో ప్రస్తుతం చక్కర్లు కొడుతుంది. మరోవైపు అత్యవసర సమయాల్లో పడవలు నడిపే స్థానిక మత్స్యకారులే వరదలు వచ్చే సమయంలో అధికారులకు సహకరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment