
ప్రతీకాత్మక చిత్రం
ఖర్టోమ్, సుడాన్ : నైలు నదిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్థులను స్కూలుకు తీసుకెళ్తున్న పడవ బుధవారం నీట మునిగింది. ఈ ఘటనలో 22 మంది విద్యార్థులు నీట మునిగి చనిపోయి ఉండొచ్చని అధికారులు వెల్లడించారు. సుడాన్ రాజధాని ఖర్టోమ్‌కు 750 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగిందనీ, ప్రమాద సమయంలో పడవలో 40 మంది విద్యార్థులున్నారని సునా వార్తా సంస్థ తెలిపింది. నదిలో తీవ్ర అలజడి రేగడంతో ఇంజన్ వైఫల్యం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. కాగా, విద్యార్థుల మృతదేహాల కోసం గాలింపు చేపట్టారు. ప్రమాదం విషయం తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు మర బోట్లలో వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న మిగతావారిని సహాయక బృందాలు రక్షించాయి. మృతుల్లో ఒక మహిళ కూడా ఉంది. పిల్లలంతా ప్రైమరీ విద్యనభ్యసిస్తున్నవారే.
Comments
Please login to add a commentAdd a comment