మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి అస్థికల నిమజ్జనం సందర్భంగా శనివారం అపశ్రుతి చోటు చేసుకుంది. అస్థికలు నదిలో నిమజ్జనం చేయానికి వెళ్లిన బీజేపీ నేతల పడవ బోల్తా పడడంతో పలువురు నాయకులు నదిలో పడిపోయారు. సిబ్బంది అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. ఉత్తర ప్రదేశ్‌లో బస్తీ నదిలో అస్థికలు నిమజ్జన సమయంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది.పడవలో ప్రయాణించిన వారిలో రాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్ రమాపాటి రామ్ త్రిపాఠి, ఎంపీ హరీష్ ద్వివేది, ఎమ్మెల్యే రామ్ చౌదరి, సీనియర్ బీజేపీ నేతలు, ఎస్పీ దిలీప్‌కుమార్ తదితరులు ఉన్నారు. ఒడ్డుకు సమీపంలో పడవ తలకిందులు కావడంతో పోలీసు సిబ్బంది నదిలోకి దూకి అందరిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఎక్కువ మంది ప్రయాణించడం వల్లే పడవ తలక్రిందులైందని అధికారులు పేర్కొన్నారు.
అటల్‌జీ అస్థికల నిమజ్జనంలో అపశ్రుతి
Published Sun, Aug 26 2018 12:09 PM | Last Updated on Wed, Mar 20 2024 5:04 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement