Ashesh
-
అదరగొట్టిన ఇంగ్లండ్
లండన్: తొలి రోజునుంచే ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ప్రతిష్టాత్మక ‘యాషెస్’ సిరీస్‌లో మరో రసవత్తర ముగింపునకు రంగం సిద్ధమైంది. చివరిదైన ఐదో టెస్టును గెలుచుకునే ప్రయత్నంలో ఇంగ్లండ్ బలంగా పట్టు బిగించింది. పదునైన బ్యాటింగ్‌తో చెలరేగి ఆస్ట్రేలియా ముందు దాదాపు అసాధ్యమైన లక్ష్యాన్ని ఉంచేందుకు సిద్ధమైంది. మ్యాచ్ మూడో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 389 పరుగులు చేసింది. అండర్సన్ (8 బ్యాటింగ్), బ్రాడ్ (2 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. ఇప్పటికే ఆ జట్టు 377 పరుగుల ఆధిక్యంలో ఉంది. మిగిలిన రెండు రోజులు ఆసీస్ బ్యాటర్లు నిలబడి లక్ష్యాన్ని ఛేదిస్తారా లేక ఇంగ్లండ్ 2–2తో సిరీస్‌ను సమం చేస్తుందా చూడాలి. ఇంగ్లండ్ మరోసారి తమ బ్యాటింగ్‌లో తొలి బంతినుంచే ‘బజ్‌బాల్’ దూకుడును ప్రదర్శించింది. ఓపెనర్లు జాక్ క్రాలీ (76 బంతుల్లో 73; 9 ఫోర్లు), బెన్ డకెట్ (55 బంతుల్లో 42; 7 ఫోర్లు) ఎప్పటిలాగే ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 17 ఓవర్లలోనే 79 పరుగులు జోడించారు. మూడో స్థానంలో వచి్చన కెప్టెన్ బెన్ స్టోక్స్ (67 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా జోరు తగ్గకుండా బ్యాటింగ్ కొనసాగించాడు. అనంతరం జో రూట్ (106 బంతుల్లో 91; 11 ఫోర్లు, 1 సిక్స్), జానీ బెయిర్‌స్టో (103 బంతుల్లో 78; 11 ఫోర్లు) ఇన్నింగ్స్‌లు ఇంగ్లండ్‌ను మరింత పటిష్ట స్థితికి చేర్చాయి. రూట్, బెయి ర్స్టో ఐదో వికెట్‌కు 110 పరుగులు జత చేశారు. 2019లోనూ ఇంగ్లండ్ గ డ్డపై జరిగిన ‘యాషెస్’ సిరీస్ 2–2తో సమంగా ముగిసింది. ఇరు జట్లు చెరో 2 టెస్టులు గెలవగా, మరో టెస్టు ‘డ్రా’ అయింది. ఆ తర్వాత 2021లో తమ సొంతగడ్డపై జరిగిన ‘యాషెస్’లో ఆ్రస్టేలియా 4–0తో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ‘దెమెంతియా’ బాధితులకు మద్దతుగా... మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ ఆటగాళ్లు భిన్నమైన రీతిలో దెమెంతియా (మతిమరపు) వ్యాధిగ్రస్తులకు సంఘీభావం ప్రకటించారు. ప్రతీ ఆటగాడు తమ పేరు రాసి ఉన్న జెర్సీ కాకుండా జట్టులోని మరో సభ్యుడి జెర్సీని ధరించి మైదానంలోకి దిగారు. మతిమరపు కారణంగా తమ వస్తువులను గుర్తించడంలో గందరగోళానికి గురి కావడం ‘దెమెంతియా’ లక్షణాల్లో ఒకటి. బ్రాడ్ పేరుతో అండర్సన్, స్టోక్స్ పేరుతో బెయిర్‌స్టో, వోక్స్ పేరుతో అలీ...ఇలా ఆటగాళ్లు టీ షర్ట్లు ధరించి ఆడారు. -
AUS vs ENG: ‘యాషెస్’ సమయం.. 1956 తర్వాత మళ్లీ ఇప్పుడే
బ్రిస్బేన్: టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత ఆసక్తికర వైరానికి మరోసారి తెర లేవనుంది. ప్రతిష్టాత్మక ‘యాషెస్’ సిరీస్ కోసం ఆసీస్ గడ్డపై రంగం సిద్ధమైంది. నేటి నుంచి ‘గాబా’ మైదానంలో జరిగే తొలి టెస్టులో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తలపడనున్నాయి. 2019లో ఇరు జట్ల మధ్య ఇంగ్లండ్‌లో చివరిసారి జరిగిన యాషెస్ సిరీస్ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. అయితే అంతకుముందు 2017లో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో ఇంగ్లండ్‌ను 4–0తో చిత్తుగా ఓడించిన కారణంగా ఆసీస్ గత యాషెస్‌ను నిలబెట్టుకుంది. ఇంగ్లండ్ టీమ్ ఆఖరిసారిగా 2010–11 సీజన్లో కంగారూలను వారి గడ్డపైనే ఓడించగలిగింది. 33 యాషెస్ సిరీస్‌లలో ఆస్ట్రేలియా... 32 సిరీస్‌లలో ఇంగ్లండ్ గెలిచిన నేపథ్యంలో మరోసారి సమఉజ్జీల మధ్య హోరాహోరీ సమరానికి అవకాశం ఉంది. జనవరి 14–18 మధ్య జరిగే ఐదో టెస్టుతో సిరీస్ ముగుస్తుంది. కెప్టెన్లకు సవాల్... ఇరు జట్ల కెప్టెన్లకు సంబంధించి కూడా తాజా ‘యాషెస్’ కీలకంగా మారింది. 1956 తర్వాత తొలిసారి ఒక ఫాస్ట్ బౌలర్ ఆసీస్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. ప్యాట్ కమిన్స్ అటు ప్రధాన బౌలర్‌గా సత్తా చాటడంతో పాటు జట్టును నడిపించాల్సిన కీలక బాధ్యత అతనిపై ఉంది. వైస్ కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ రూపంలో అతనికి సహకారం లభించనుండటం కొంత సానుకూలాంశం. ఆసీస్ ఇప్పటికే తమ తుది జట్టును ప్రకటించింది. టిమ్ పైన్ ఆట నుంచి విరామం తీసుకున్న నేపథ్యంలో అలెక్స్ క్యారీ వికెట్ కీపర్‌గా ఈ టెస్టులో అరంగేట్రం చేయనున్నాడు. మరోవైపు ఇంగ్లండ్ గెలవాలంటే కెప్టెన్ రూట్ భారీగా పరుగులు సాధించాల్సి ఉంది. ఆసీస్ గడ్డపై అతని రికార్డు ఇప్పటి వరకు గొప్పగా లేదు. 17 ఇన్నింగ్స్‌లలో అతను ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రూట్ ఇక్కడా చెలరేగాల్సి ఉంది. డే అండ్ నైట్‌గా జరిగే రెండో టెస్టు (అడిలైడ్) కోసం తగిన రీతిలో సన్నద్ధమయ్యేందుకు ఇంగ్లండ్ తమ ప్రధాన పేసర్ అండర్సన్‌కు ఈ టెస్టు నుంచి విశ్రాంతినిచ్చింది. చాలా రోజుల తర్వాత స్టోక్స్ పునరాగమనం చేయనుండటంతో ఇంగ్లండ్ బలం పెరిగింది. మరో వికెట్ తీస్తే ఆఫ్‌స్పిన్నర్ నాథన్ లయోన్... వార్న్, మెక్‌గ్రాత్ తర్వాత 400 వికెట్ల మైలురాయిని అందుకున్న మూడో ఆసీస్ బౌలర్‌గా నిలుస్తాడు. -
విషాదం: తండ్రి అస్థికలు నిమజ్ఙనం కోసం..
సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో విషాదం నెలకొంది. ఇటీవల మరణించిన తండ్రి అస్థికలు నిమజ్ఙనం చేయడానికి వెళ్లిన ఇద్దరు కుమారులు మృతి చెందారు. ఈ విషాద ఘటన రావికమతంలో చోటుచేసుకుంది. విశాఖ జిల్లా రావికమతంలోని కళ్యాణపు లోవ జలాశయంలో స్నానానికి దిగిన ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. (చదవండి : చపాతీలో విషం : ఇద్దరిని బలిగొన్న మహిళ) బుచ్చయ్యపేటకు చెందిన సూరిశెట్టి మూర్తి, గోపీలు తండ్రి అస్థికలను జలాశయంలో కలపడం కోసం వెళ్లారు. మూర్తి నీటిలోకి దిగి అస్థికలు కలుపుతున్న సమయంలో ప్రమాదవశాత్తు దాంట్లొ పడిపోయారు. సోదరుడుని రక్షించే క్రమంలో గోపి కూడా మృతి చెందాడు. తండ్రి చనిపోయిన కొద్ది రోజులకే చేతికొచ్చిన ఇద్దరు కొడుకులు మృతి చెందడంతో విషాదంలో బుచ్చయ్యపేట గ్రామంలో విషాదం నెలకొంది. -
ఆషెస్ సిరీస్‌లో దుమ్మురేపుతున్న స్టీవ్ స్మిత్
-
మొండి ధైర్యం ప్రదర్శించిన స్మిత్
లండన్: అది ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 77వ ఓవర్. మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 152 బంతుల్లో 80 పరుగులతో ఆడుతున్నాడు. క్రీజు మొత్తం నాదే అన్నట్లు కదులుతూ, మంచి బంతులను దీటుగా ఆడుతూ, వీలు చిక్కితే బౌండరీలు బాదుతూ ఇంగ్లండ్ బౌలర్లకు చిర్రెత్తిస్తున్నాడు. నిలకడగా 145 నుంచి 155 కి.మీ. వేగంతో వస్తున్న ఆర్చర్ బంతులను కాచుకుంటూ జట్టు స్కోరును 200 దాటించాడు. అప్పటికీ ఆర్చర్ వేసిన 71వ ఓవర్ చివరి బంతి బలంగా తగిలి స్మిత్ ఎడమచేయి వాచిపోయింది. అయినా, మొండిగా ఆడిన అతడు 80ల్లోకి వచ్చాడు. సెంచరీ చేసేలా కనిపించాడు.అంతలోనే అనూహ్య ఘటన...! పేసర్ జోఫ్రా ఆర్చర్ వేసిన 77వ ఓవర్ రెండో బంతి నేరుగా స్మిత్ మెడకు తగిలింది. 149 కిలోమీటర్ల వేగంతో షార్ట్ లెంగ్త్‌లో వచ్చిన ఆ బంతిని తప్పించుకోలేకపోయిన అతడు కుప్పకూలాడు. వెల్లకిలా పడుకుని నొప్పితో విలవిల్లాడాడు. మైదానంలో ఒక్కసారిగా కలవరం. జట్టు డాక్టర్ పరుగు పరుగున వచ్చాడు. ఆర్చర్ మినహా ఇంగ్లండ్ ఆటగాళ్లు స్మిత్ చుట్టూ చేరిపోయారు. 2014 నాటి ఫిల్ హ్యూస్ ఉదంతం తలచుకుని అటు ఆస్ట్రేలియా టీంలోనూ కంగారు.కాస్త దిమ్మెరపోయినప్పటికీ స్మిత్ వెంటనే పైకి లేచాడు. డాక్టర్‌తో సంభాషించి రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడాడు. అయితే 9 ఓవర్ల అనంతరం వచ్చి వోక్స్ బౌలింగ్‌లో రెండు వరుస బౌండరీలు బాదాడు. వోక్స్ మరుసటి ఓవర్లో ఓ ఫోర్ కొట్టి వికెట్ల ముందు దొరికిపోయాడు. ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో యాషెస్ రెండో టెస్టు నాలుగో రోజు శనివారం ఇరు జట్ల ఆట కంటే ఈ ఘటనే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. మొత్తానికి సెంచరీ చేజారినా స్టీవ్ స్మిత్ (161 బంతుల్లో 92; 14 ఫోర్లు) మరో అద్భుత ఇన్నింగ్స్‌తో ఆసీస్‌ను ఆదుకున్నాడు. అతడి పోరాటంతో తొలి ఇన్నింగ్స్‌లో జట్టు 250 పరుగులకు ఆలౌటై ఇంగ్లండ్ స్కోరు (258)కు దగ్గరగా వచ్చింది. 8 పరుగుల స్వల్ప ఆధిక్యంతో అనంతరం రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఆతిథ్య జట్టును కమిన్స్ (2/16), సిడిల్ (2/19) దెబ్బకొట్టారు. కెప్టెన్ జో రూట్ (0)డకౌట్ అయ్యాడు. రోజు ముగిసేసరికి ఇంగ్లండ్ 96/4 తో నిలిచింది. ఆ జట్టు 104 పరుగుల ఆధిక్యంలో ఉంది. స్మిత్ వర్సెస్ ఆర్చర్ ఓవర్‌నైట్ స్కోరు 80/4తో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్‌కు ఎప్పటిలాగే స్మిత్ ఆపద్బాంధవుడయ్యాడు. మాథ్యూ వేడ్ (6) తొందరగానే ఔటైనా, కెప్టెన్ టిమ్ పైన్ (70 బంతుల్లో 23; 2 ఫోర్లు); కమిన్స్ (80 బంతుల్లో 20; 3 ఫోర్లు)తో కలిసి ఇన్నింగ్స్ నడిపించాడు. ఈ క్రమంలోనే యాషెస్‌లో వరుసగా ఏడో అర్ధ శతకాన్ని (107 బంతుల్లో) సాధించాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లంచ్ తర్వాత స్మిత్ వర్సెస్ ఆర్చర్‌గా సాగింది. ఆర్చర్ వేసిన 8 ఓవర్ల స్పెల్ భీకరంగా సాగింది. స్మిత్‌కు 73వ ఓవర్ చివరి బంతిని అతడు 155 కి.మీ. వేగంతో సంధించడం గమనార్హం. -
అటల్జీ అస్థికల నిమజ్జనంలో అపశ్రుతి
-
అటల్జీ అస్థికల నిమజ్జనంలో అపశ్రుతి
లక్నో : మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి అస్థికల నిమజ్జనం సందర్భంగా శనివారం అపశ్రుతి చోటు చేసుకుంది. అస్థికలు నదిలో నిమజ్జనం చేయానికి వెళ్లిన బీజేపీ నేతల పడవ బోల్తా పడడంతో పలువురు నాయకులు నదిలో పడిపోయారు. సిబ్బంది అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. ఉత్తర ప్రదేశ్‌లో బస్తీ నదిలో అస్థికలు నిమజ్జన సమయంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. పడవలో ప్రయాణించిన వారిలో రాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్ రమాపాటి రామ్ త్రిపాఠి, ఎంపీ హరీష్ ద్వివేది, ఎమ్మెల్యే రామ్ చౌదరి, సీనియర్ బీజేపీ నేతలు, ఎస్పీ దిలీప్‌కుమార్ తదితరులు ఉన్నారు. ఒడ్డుకు సమీపంలో పడవ తలకిందులు కావడంతో పోలీసు సిబ్బంది నదిలోకి దూకి అందరిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఎక్కువ మంది ప్రయాణించడం వల్లే పడవ తలక్రిందులైందని అధికారులు పేర్కొన్నారు. -
వాడపల్లి సంగమంలో వాజ్‌పేయి అస్థికల నిమజ్జనం
దామరచర్ల (మిర్యాలగూడ): మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అస్థికలను నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి కృష్ణా–మూసీ నదుల సంగమంలో గురువారం నిమజ్జనం చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ఆధ్వర్యంలో వాజ్‌పేయి అస్థికల కలశాన్ని సంగమం వద్దకు తీసుకువచ్చారు. బ్రాహ్మణులు వేద మంత్రాల నడుమ ఆ కలశాన్ని పుణ్యజలంతో అభిషేకించిన అనంతరం సంగమంలో నిమజ్జనం చేశారు. మురళీధర్‌రావు మాట్లాడుతూ, అటల్జీ దేశాభివృద్ధికి కన్న కలలను నిజం చేయడమే ఆయనకు మనమిచ్చే నివాళులన్నారు. కులాలు, మతాలకు అతీతంగా అటల్జీ పనిచేశారని గుర్తుచేశారు. ఆయన చితాభస్మాన్ని దేశంలోని 150 నదుల్లో కలుపుతున్న ట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నేతలు మనోహర్‌రెడ్డి, చింతా సాంబమూర్తి, పాదూరి కరుణ, నూకల నర్సింహారెడ్డి, సాంబయ్య, బాబా, దొండపాటి వెంకటరెడ్డి, కర్నాటి ప్రభాకర్, బంటు సైదులు పాల్గొన్నారు. -
ఆసీస్ అదరహో...
సిడ్నీ: ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ మళ్లీ చేతులెత్తేశారు. ఫలితంగా యాషెస్ సిరీస్‌లో చివరిదైన ఐదో టెస్టులోనూ ఆస్ట్రేలియానే విజయం వరించింది. ఇన్నింగ్స్ 123 పరుగుల ఆధిక్యంతో గెలిచిన స్టీవ్ స్మిత్ బృందం 4–0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. సిరీస్‌లో నాలుగో టెస్టు ‘డ్రా’గా ముగిసింది. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి ఎదురునిలువలేక ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే పరిమితమైంది. ఓవర్‌నైట్ స్కోరు 93/4తో ఆట చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇంగ్లండ్ మరో 87 పరుగులు జోడించి మిగతా వికెట్లను కోల్పోయింది. కమిన్స్ (4/39), లయన్ (3/54) ఇంగ్లండ్‌ను దెబ్బ తీశారు. కడుపు నొప్పితో బాధ పడుతూనే ఆడిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ (58) అర్ధ శతకం అనంతరం రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగి మళ్లీ బ్యాటింగ్‌కు రాలేదు. కమిన్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’... స్మిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ పురస్కారాలు లభించాయి. -
ఇంగ్లండ్ 196/4
బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో ఆరంభమైన యాషెస్ సిరీస్ తొలి టెస్టులో ఇంగ్లండ్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. గురువారం ప్రారంభమైన మొదటి టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లండ్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్ ఓపెనర్ అలెస్టర్ కుక్(2) ను స్టార్క్ పెవిలియన్‌కు పంపి శుభారంభం అందించాడు. ఆపై అటు తరువాత మార్క్ స్టోన్ మ్యాన్(53), జేమ్స్ విన్సే(83) లు హాఫ్ సెంచరీలు సాధించి ఇంగ్లండ్ స్కోరును చక్కదిద్దారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 125 పరుగులు జోడించడంతో ఇంగ్లండ్ తేరుకుంది. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్(15) నిరాశపరిచాడు. డేవిడ్ మలాన్(28 బ్యాటింగ్), మొయిన్ అలీ(13 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. -
నేతాజీ కుమార్తె సంచలన వ్యాఖ్యలు
-
నేతాజీ కుమార్తె సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: అజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు, జాతీయ నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945 ఆగస్ట్ 18న విమాన ప్రమాదంలో చనిపోయారనే విషయాన్ని నమ్ముతున్నట్లు ఆయన కుమార్తె అనితా బోస్ (73) ప్రకటించారు. స్వాతంత్ర్య పూర్వమే ప్రపంచవ్యాప్తంగా ఎంతో బలమైన నాయకుడిగా ఎదిగిన తన తండ్రి నేతాజీ భారత్ తిరిగొస్తే, నెహ్రూకు మంచి బలమైన ప్రత్యామ్నాయంగా మారి ఉండేవారని ఆమె వ్యాఖ్యానించారు. జపాన్‌లోని రెంకోజీ దేవాలయంలో ఉంచిన నేతాజీ అస్థికలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని అనితా బోస్ డిమాండ్ చేశారు. బోస్ 119వ జయంతి సందర్భంగా మీడియాతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ వ్యవహారంలో ప్రధాని ప్రయత్నాల పట్ల అనితా బోస్ హర్షం వ్యక్తం చేశారు. అయితే ఈ మిస్టరీకి ఇప్పటికైనా ముగింపు పడుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. తండ్రికి సంబంధించి ప్రత్యేక జ్ఞపకాలేవీ లేకపోయినప్పటికీ, ఆయన గొప్పదనం గురించి తల్లి ఎపుడూ చెబుతూ ఉండేవారన్నారు. భారతదేశం స్వాతంత్ర్యం కోసం సర్వం త్యాగం చేసిన వ్యక్తి అని అనితా బోస్ కొనియాడారు. కొన్ని సమస్యలపై నెహ్రుకు, తన తండ్రికి అభిప్రాయాలు ఒకేలా ఉన్నా, విబేధాలు కూడా ఉన్నాయన్నారు. ముఖ్యంగా మత ఘర్షణలు, మతాధిపత్యం లేని రాజకీయ వ్యవస్థను ఇద్దరూ అభిలాషించారని తెలిపారు. అలాగే పారిశ్రామికీకరణను ఇద్దరూ కోరుకున్నా, పాకిస్తాన్ విషయంలో మాత్రం చాలా తేడాలున్నాయని ఆమె చెప్పారు. బోస్ బతికుంటే రాజకీయాల్లో క్రీయాశీల పాత్ర పోషించేవారని, నెహ్రూకు ప్రత్యామ్నాయంగా కచ్చితంగా ఉండేవారని వ్యాఖ్యానించారు. పొరుగుదేశం పాకిస్తాన్‌తో సంబంధాలు మెరుగ్గా ఉండేలా ప్రయత్నించి, విజయం సాధించి వుండేవారని తెలిపారు. తన జీవితాన్ని దేశానికి అంకితం చేసిన ఒక వ్యక్తి, దేశానికి, రాజకీయాలకు, తన కుటుంబానికి సంబంధం లేకుండా ఒక బాబాగా ఎక్కడో పర్వతాల్లో బతికి ఉంటారనే విషయాన్ని ఎలా నమ్ముతామని అనితా బోస్ ప్రశ్నించారు. ఆయన బతికుంటే అందరికీ సంతోషమే కానీ, పర్వతాల్లో గుమనామి బాబా సంచరిస్తున్నారంటూ మతి లేని ప్రచారం చేయడం నేతాజీ ప్రతిష్టకే భంగకరమన్నారు. అలాగే దేశం కోసం జీవితాన్ని అర్పించిన వ్యక్తి మరణం వివాదాస్పద కావడం బాధ కలిగించిందన్నారు. దేశ ప్రజలు తన తండ్రిని ఆ వివాదం ద్వారా గుర్తు పట్టడం విచారించాల్సిన విషయమని అనితా బోస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో భారత్, జపాన్ ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలన్నారు. ప్రత్యేక నిపుణులతో అస్థికలకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించి నిజాలను నిగ్గు తేల్చాలని కోరారు. దశాబ్దాలుగా ఇంత అగౌరవమైన చర్చ జరుగుతున్నా జపాన్ ఈ నిజాలను బయట పెట్టకపోవడం ఆ దేశానికే అవమానకరమని చురకలంటించారు. కాగా నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించి భారత ప్రభుత్వం వద్ద ఉన్న కొన్ని రహస్య పత్రాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. బోస్ 119వ జయంతి సందర్భంగా ఈ నెల 23వ తేదీన (శనివారం) బహిర్గతం చేయనున్నారు. ఈ నేపథ్యంలో జరిగే కార్యక్రమానికి బోస్ కుటుంబ సభ్యులు, కొందరు నాయకులు హాజరవుతారని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ గురువారం తెలిపారు. ఈ నేపథ్యంలో నేతాజీ కుమార్తె అనిత వ్యక్తం చేసిన అభిప్రాయాలకు ప్రాధాన్యత ఏర్పడింది. మరి కొద్దిగంటల్లో ప్రభుత్వం వివరాలు బయటపెట్టనున్న తరుణంలో ఏడు దశాబ్దాలుగా ఉత్కంఠను రాజేసిన మిస్టరీకి ఇక తెరపడనుందా.. వేచి చూడాల్సిందే. -
యాషెస్ తొలి టెస్టు ఇంగ్లండ్‌దే...
169 పరుగులతో ఆసీస్ చిత్తు కార్డిఫ్: గత యాషెస్‌లో 0-5తో దారుణంగా ఓడిన ఇంగ్లండ్ ఈసారి మాత్రం తొలి టెస్టులోనే జూలు విదిల్చింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌ను మరో రోజు మిగిలి ఉండగానే 169 పరుగుల తేడాతో గెలిచింది. 412 పరుగుల విజయలక్ష్యంతో నాలుగో రోజు శనివారం బరిలోకి దిగిన ఆసీస్‌ను ఇంగ్లండ్ బౌలర్లు కుదురుకోనీయలేదు. ఫలితంగా 70.3 ఓవర్లలో 242 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ప్రారంభంలో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (86 బంతుల్లో 52; 6 ఫోర్లు; 1 సిక్స్) కాస్త పోరాడినా పేసర్ స్టువర్ట్ బ్రాడ్ (3/39), మొయిన్ అలీ (3/59) ధాటికి మిడిల్ ఆర్డర్ తోక ముడిచింది. అయితే చివర్లో మిచెల్ జాన్సన్ (94 బంతుల్లో 77; 9 ఫోర్లు; 2 సిక్సర్లు) అసమాన పోరాటాన్ని ప్రదర్శించినా లాభం లేకపోయింది. మార్క్ వుడ్, జో రూట్లకు రెండేసి వికెట్లు దక్కాయి. రూట్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.