
బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో ఆరంభమైన యాషెస్ సిరీస్ తొలి టెస్టులో ఇంగ్లండ్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. గురువారం ప్రారంభమైన మొదటి టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లండ్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్ ఓపెనర్ అలెస్టర్ కుక్(2) ను స్టార్క్ పెవిలియన్‌కు పంపి శుభారంభం అందించాడు.
ఆపై అటు తరువాత మార్క్ స్టోన్ మ్యాన్(53), జేమ్స్ విన్సే(83) లు హాఫ్ సెంచరీలు సాధించి ఇంగ్లండ్ స్కోరును చక్కదిద్దారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 125 పరుగులు జోడించడంతో ఇంగ్లండ్ తేరుకుంది. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్(15) నిరాశపరిచాడు. డేవిడ్ మలాన్(28 బ్యాటింగ్), మొయిన్ అలీ(13 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment