
సిడ్నీ: ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ మళ్లీ చేతులెత్తేశారు. ఫలితంగా యాషెస్ సిరీస్‌లో చివరిదైన ఐదో టెస్టులోనూ ఆస్ట్రేలియానే విజయం వరించింది. ఇన్నింగ్స్ 123 పరుగుల ఆధిక్యంతో గెలిచిన స్టీవ్ స్మిత్ బృందం 4–0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. సిరీస్‌లో నాలుగో టెస్టు ‘డ్రా’గా ముగిసింది. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి ఎదురునిలువలేక ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే పరిమితమైంది. ఓవర్‌నైట్ స్కోరు 93/4తో ఆట చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇంగ్లండ్ మరో 87 పరుగులు జోడించి మిగతా వికెట్లను కోల్పోయింది.
కమిన్స్ (4/39), లయన్ (3/54) ఇంగ్లండ్‌ను దెబ్బ తీశారు. కడుపు నొప్పితో బాధ పడుతూనే ఆడిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ (58) అర్ధ శతకం అనంతరం రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగి మళ్లీ బ్యాటింగ్‌కు రాలేదు. కమిన్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’... స్మిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ పురస్కారాలు లభించాయి.