
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో విషాదం నెలకొంది. ఇటీవల మరణించిన తండ్రి అస్థికలు నిమజ్ఙనం చేయడానికి వెళ్లిన ఇద్దరు కుమారులు మృతి చెందారు. ఈ విషాద ఘటన రావికమతంలో చోటుచేసుకుంది. విశాఖ జిల్లా రావికమతంలోని కళ్యాణపు లోవ జలాశయంలో స్నానానికి దిగిన ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. (చదవండి : చపాతీలో విషం : ఇద్దరిని బలిగొన్న మహిళ)
బుచ్చయ్యపేటకు చెందిన సూరిశెట్టి మూర్తి, గోపీలు తండ్రి అస్థికలను జలాశయంలో కలపడం కోసం వెళ్లారు. మూర్తి నీటిలోకి దిగి అస్థికలు కలుపుతున్న సమయంలో ప్రమాదవశాత్తు దాంట్లొ పడిపోయారు. సోదరుడుని రక్షించే క్రమంలో గోపి కూడా మృతి చెందాడు. తండ్రి చనిపోయిన కొద్ది రోజులకే చేతికొచ్చిన ఇద్దరు కొడుకులు మృతి చెందడంతో విషాదంలో బుచ్చయ్యపేట గ్రామంలో విషాదం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment