
బీజింగ్: చైనాలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. చైనా నైరుతి భాగంలోని గుయిజోవూలోని బీపన్ నదిలో ఓ పడవ బోల్తా పడడంతో 10 మంది మృతి చెందగా మరో ఎనిమిది మంది గల్లంతయ్యారు. ఈ విషయాన్ని అధికారులు శుక్రవారం వెల్లడించారు. ఇప్పటివరకు తాము 11 మందిని రక్షించామని చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ పడవలో మొత్తం 29 మంది ప్రయాణం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ పడవ యజమాని కూడా అందులోనే ప్రయాణిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment