
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ, మండలిలో పార్టీ ఫిరాయింపుల చట్టం పూర్తిగా దుర్వినియోగం అవుతుందని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ముగ్గురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలపై ఫిర్యాదు చేసిన నెల రోజులకే వేటు వేశారు. అదే టీఆర్‌ఎస్‌లో చేరిన ఇతర పార్టీల నేతలపై ఫిర్యాదు చేస్తే మాత్రం ఇప్పటి వరకు విచారణ చేయలేదన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఇష్టానుసారం అన్వయించుకుంటూ స్పీకర్, మండలి చైర్మన్ ప్రజాస్వామ్యాన్ని, ఫిరాయింపుల చట్టాన్ని తుంగలో తొక్కారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment