సాయుధ పోరాట వార్షికోత్సవ సభలో మాట్లాడుతున్న చాడ వెంకట్‌రెడ్డి
సాక్షి, సిద్దిపేట: ఎన్నో ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచిన తెలంగాణ సాయుధ పోరాటంలోని ప్రధాన ఘట్టం వీర బైరాన్‌పల్లిని చారిత్రక భూమిగా గుర్తించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ సాయుధ పోరాట 74వ వార్షికోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లాలో ని బైరాన్‌పల్లి, కూటిగల్లు, హుస్నాబాద్ ప్రాంతాల్లోని బురుజులు, స్తూపాల వద్ద నివాళులర్పించారు.
అనంతరం చాడ మాట్లాడుతూ.. నిజాం నిరంకుశానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధుల త్యాగాలు చిరస్మరణీయం అని పేర్కొన్నారు. ఈ ప్రాంతానికి నిజమైన స్వాతంత్య్రం నిజాం పాలన అంతమైన తర్వాతే వచ్చిందన్నారు. 86 మంది అమరులను ఒకే చితిపై పెట్టి నిప్పుపెట్టిన చరిత్ర ఇక్కడి నేలదన్నారు. ఎన్నికల సందర్భంలో వచ్చిన నాయకులు ౖబైరాన్‌పల్లిని చారిత్రక ప్రదేశంగా గుర్తిస్తామని, అభివృద్ధి చేసి స్మారక చిహ్నం, మ్యూజియం నిర్మిస్తామని చెప్పారే తప్పా.. ఏ ఒక్కరూ కూడా ఈ ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ౖబైరాన్‌పల్లి్లని చారిత్రక భూమిగా గుర్తించి అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment