సాక్షి, హైదరాబాద్: పోడు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పట్టాలివ్వకపోవడం అన్యాయమని, వెంటనే వారికి పట్టాలివ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా పోడుసాగుదారులకు అన్యాయం జరిగిందని, ఎన్ని పోరాటాలు చేసినా పోడుసాగుదారులకు పట్టాలివ్వలేదని వాపోయారు.
తెలంగాణ వచ్చి ఇప్పటికి ఏడేళ్లు గడుస్తున్నా పట్టాలివ్వకపోవడం శోచనీయమని, ధరఖాస్తులు తీసుకుని ఎందుకు పెండింగ్‌లో పెడుతున్నారో అర్థం కావడంలేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోడుపట్టాలివ్వకపోవడం వల్ల రైతుబంధు అందడం లేదని, చనిపోయిన రైతు కుటుంబాలకు రైతుబీమా అందక రోడ్డున పడ్డారని, పంట రుణాలు ఇవ్వడం లేదని విచారం వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment