సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్య విలువలను పట్టించుకోకుండా సీఎం కేసీఆర్ తప్పుల మీద తప్పులు చేస్తున్నారని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ శాసన మండలి సభాపక్షం విలీనం కేసు కోర్టులో నడుస్తుండగానే, కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీన లేఖను ఇచ్చిన వెంటనే స్పీకర్ ఆమోదించడం జరిగిపోయాయన్నారు. శుక్రవారం ఆయన విలే కరులతో మాట్లాడుతూ అప్రజాస్వామిక పద్ధతుల్లో, కక్షసాధింపు ధోరణితోనే టీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్ సభ్యుల విలీనానికి తెరతీశారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రభుత్వంపై పోరాడతామని, ప్రభుత్వం తన పద్ధతులను మార్చుకోకపోతే ఉద్యమాలు తప్ప వని హెచ్చరించారు. అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌లో చేరామంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అబద్ధాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment