సెప్టెంబర్‌ 17ను తెలంగాణ స్వాతంత్య్ర దినంగా గుర్తించాలి | Chada Venkat Reddy Letter To The CM About Telangana Independence Day | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్‌ 17ను తెలంగాణ స్వాతంత్య్ర దినంగా గుర్తించాలి

Published Tue, Aug 31 2021 4:36 AM | Last Updated on Tue, Aug 31 2021 4:36 AM

Chada Venkat Reddy Letter To The CM About Telangana Independence Day - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సెప్టెంబర్‌ 17ను తెలంగాణ స్వాతంత్య్ర దినంగా గుర్తిస్తూ జాతీయ జెండాను ఎగురవేసి సాయుధ పోరాట అమరవీరుల స్మృతి చిహ్నాన్ని సచివాలయం సమీపంలో నిర్మించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖరాశారు. ‘దేశా నికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో తెలంగాణ ప్రాంతం నిజాం రాచరిక, నిరంకుశ పాలనలో నలుగుతున్నది. నిజాం రాచరిక వ్యవస్థ అంతం కావాలని, వెట్టిచాకిరీ, దుర హంకారాలు, దోపిడీ, దౌర్జన్యాలు అంతం కావాలని 1947 సెప్టెంబర్‌ 11న ఆంధ్ర మహా సభ, కమ్యూనిస్టు పార్టీ నాయకులు రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మఖ్దూం మొ హియుద్దీన్‌ సాయుధ పోరాటానికి పిలు పునిచ్చారు.

నిజాం సైన్యాలు, రజాకార్లు సా గించిన దాడుల్లో వేలాది మందిని చిత్రహిం సలకు గురిచేశారు. దీంతో పరిస్థితిని గమ నించిన నిజాం రాష్ట్రంపై యూనియన్‌ సైన్యా లు పోలీస్‌ యాక్షన్‌ పేరుతో దాడి చేశాయి. రెండు రోజుల్లో నిజాం ప్రభుత్వం లొంగుబా టును ప్రదర్శించి, హైదరాబాద్‌ను భారతదే శంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది’ అని వివరించారు. కానీ, తెలంగాణ ప్రజలు స్వాతంత్య్రం పొందిన రోజు చరిత్రలో కనుమరుగయిందని తెలిపారు. ఆనాటి తెలం గాణ పోరాటయోధుల పెన్షన్‌ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని గుర్తించి రాష్ట్రప్రభుత్వం తరపున పెన్షన్‌ మంజూరు చేయాలని చాడ కోరారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement