telangana independence day
-
ఆవిర్భావ వేడుకలకు ఈసీ అనుమతి
సాక్షి, హైదరాబాద్: జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అనుమతిచి్చన నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించనున్న ఈ వేడుకల కోసం చేపట్టాల్సిన చర్యలపై శుక్రవారం ఆమె సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇందులో డీజీపీ రవి గుప్తాతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్‌సిన్హా, సీనియర్ ఐఏఎస్ అధికారులు బి.వెంకటేశం, జితేందర్, క్రిస్టినా జోంగ్తు, వాటర్‌బోర్డు ఎండీ సుదర్శన్‌రెడ్డి, టీజీపీడీసీఎల్ ఎండీ ముషారఫ్, సీడీఎంఏ దివ్య, సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ ఎం.హనుమంతరావు తదితర అధికారులు పాల్గొన్నారు.శాంతికుమారి మాట్లాడుతూ ఆవిర్భావ వేడుకల సందర్భంగా వీఐపీలు ప్రయాణించే మార్గాల్లో తగిన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని, ట్రా ఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేసి పార్కింగ్ స్థలాలను కేటాయించాలని పోలీసు శాఖకు సూచించారు. ప్రజలకు ఎండ తగలకుండా బారికేడింగ్‌తో పాటు నీడ కోసం షామియానాలను ఏర్పాటు చేసే బాధ్యతలను ఆర్అండ్బీ శాఖకు అప్పగించారు. సభా ప్రాంగణ ప్రాంతాల్లో పారిశు ద్ధ్య పనుల నిర్వహణతో పాటు తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని, రోడ్డుకు ఇరువైపులా రంగురంగుల జెండాలను అలంకరించాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు.పండుగ వాతావరణాన్ని తలపించేలా కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సాంస్కృతిక శాఖను, నిరంతరాయంగా విద్యు త్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ అధికారులను సీఎస్ ఆదేశించారు. సీఎం రేవంత్గన్పార్క్ను సందర్శించి తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులరి్పంచి పరేడ్‌గ్రౌండ్‌కు చేరుకుంటారని, ఇందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. -
కేంద్రం ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు!
సాక్షి, హైదరాబాద్/రసూల్‌పురా: జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గోల్కొండ కోటలో జాతీయజెండాను ఎగురవేయనున్నట్టు కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖల మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ ఉత్సవాల్లో భాగంగా ఉదయం జెండా వందనం సందర్భంగా కేంద్ర బలగాల కవాతు కూడా నిర్వహించనున్నారు. సాయంత్రం గోల్కొండ కోటలో సాంస్కృతిక కార్యక్రమాలు సైతం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. గురువారం జరిగిన బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా వర్కింగ్ కమిటీ సమావేశంలో కిషన్‌రెడ్డి రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ప్రకటన చేసినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జూన్ 2 నుంచి 21 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో చారిత్రక గోల్కొండ కోటలో నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ ఉత్సవాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి కిషన్‌రెడ్డి లేదా సీనియర్ మంత్రి జాతీయజెండాను ఎగురవేసే అవకాశముంది. ఈ ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వంతోపాటు సీఎం కేసీఆర్, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, డీజీపీలకు ఆహ్వానాలు పంపనున్నట్లు సమాచారం. గత సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలకు బీజేపీ అగ్రనేత, కేంద్రహోం మంత్రి అమిత్‌షా ముఖ్యఅతిథిగా హాజరై సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ ఇతర కేంద్ర బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. రాష్ట్రంలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అదే తరహాలో కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశ ఔన్నత్యాన్ని చాటుతున్న మోదీ దేశంలో ఉగ్రవాద కదలికలను కట్టడి చేసి ప్రపంచ దేశాలకు భారత దేశ ఔన్నత్యాన్ని చాటుతున్న నేత ప్రధాని మోదీ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మోదీ నాయకత్వంలో దేశం ప్రగతి పథంలో దూసుకుపోతున్నా ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పాలనలో పది లక్షల కుంభకోణం జరిగిందని కాగ్, సుప్రీంకోర్టులు నిర్ధారించాయన్నారు. కార్యక్రమంలో ఎంపీ డా.కె.లక్ష్మణ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సెప్టెంబర్ 17ను తెలంగాణ స్వాతంత్య్ర దినంగా గుర్తించాలి
సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 17ను తెలంగాణ స్వాతంత్య్ర దినంగా గుర్తిస్తూ జాతీయ జెండాను ఎగురవేసి సాయుధ పోరాట అమరవీరుల స్మృతి చిహ్నాన్ని సచివాలయం సమీపంలో నిర్మించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖరాశారు. ‘దేశా నికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో తెలంగాణ ప్రాంతం నిజాం రాచరిక, నిరంకుశ పాలనలో నలుగుతున్నది. నిజాం రాచరిక వ్యవస్థ అంతం కావాలని, వెట్టిచాకిరీ, దుర హంకారాలు, దోపిడీ, దౌర్జన్యాలు అంతం కావాలని 1947 సెప్టెంబర్ 11న ఆంధ్ర మహా సభ, కమ్యూనిస్టు పార్టీ నాయకులు రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మఖ్దూం మొ హియుద్దీన్ సాయుధ పోరాటానికి పిలు పునిచ్చారు. నిజాం సైన్యాలు, రజాకార్లు సా గించిన దాడుల్లో వేలాది మందిని చిత్రహిం సలకు గురిచేశారు. దీంతో పరిస్థితిని గమ నించిన నిజాం రాష్ట్రంపై యూనియన్ సైన్యా లు పోలీస్ యాక్షన్ పేరుతో దాడి చేశాయి. రెండు రోజుల్లో నిజాం ప్రభుత్వం లొంగుబా టును ప్రదర్శించి, హైదరాబాద్‌ను భారతదే శంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది’ అని వివరించారు. కానీ, తెలంగాణ ప్రజలు స్వాతంత్య్రం పొందిన రోజు చరిత్రలో కనుమరుగయిందని తెలిపారు. ఆనాటి తెలం గాణ పోరాటయోధుల పెన్షన్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని గుర్తించి రాష్ట్రప్రభుత్వం తరపున పెన్షన్ మంజూరు చేయాలని చాడ కోరారు. -
ఏవీ ఆ అడుగుజాడలు?
సంస్మరణం: తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధికారికంగా గుర్తించి నిర్వహించడం లేదు. దీనితో తమ ప్రత్యేకతను ఆరంభంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హరించిందన్న భావనకు తెలంగాణ వారిలో బీజం పడింది. ఆగస్టు 15, 1947 దేశానికి స్వాతంత్య్రం లభిస్తే, తెలంగాణ సహా నిజాం సంస్థానంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సెప్టెం బర్ 17, 1948న స్వాతంత్య్రం లభించింది. హైదరాబాద్ సం స్థానాన్ని భారత యూనియన్ లో విలీనం చేయడానికి సెప్టెం బర్ 13, 1948 నుంచి సెప్టెం బర్ 18, 1948 వరకు జరిగిన పోలీసు చర్య ఫలితంగా నిజాం ప్రభువు చేతులెత్తి తన సుముఖతను వ్యక్తం చేశాడు. స్వతంత్ర ప్రతిపత్తిని వదులుకుని, కొన్ని సదుపాయాలను రాబట్టుకుని సంస్థానాన్ని విలీనం చేశాడు. నిజాం సంస్థానంలో ఒకప్పుడు భాగంగా ఉండి, ఇప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో భాగమైన ప్రాం తాలలో ఆ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సెప్టెంబర్ 17ను సాధికారికంగా స్వాతంత్య్ర దినోత్సవంగా నిర్వహిస్తున్నాయి. కానీ తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధికారికంగా గుర్తించి నిర్వహించడం లేదు. దీనితో తమ ప్రత్యేకతను ఆరంభంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హరించిందన్న భావనకు తెలంగాణ వారిలో బీజం పడింది. ఆంధ్రప్రదేశ్ అవతరణ సందర్భంగా తెలంగాణ వారికి ఇచ్చిన హామీలు, ఇరువురి మధ్య జరిగిన ఒప్పం దాలు, 610 జీవో వంటి కీలక అంశాలు నీటిమూటలుగా మిగిలిపోయాయనీ, ఆంధ్ర ప్రాంత పాలకుల నిర్లక్ష్యానికి తాము గురయ్యామనీ; రాజకీయంగా, సాంస్కృతికంగా వెనుకబడిపోవడానికి ఇవి కారణమైనాయనీ ఆ ప్రాంత ప్రజానీకం భావించడం మొదలుపెట్టింది. ఇదే నివురుగప్పిన నిప్పులా ఉండి, నిరసనల రూపంలో బయటపడుతూనే ఉంది. ఇక్కడ చెప్పదలుచుకున్న అంశం కోసమే ఈ ఉపోద్ఘాతం చెప్పవలసివచ్చింది. నిజాం పాలనలో ఆయన తాబేదార్లు, భూస్వాములు, దుర్మార్గంగా సాగిన స్థానిక పాలన కారణంగా రైతులు, సామాన్య ప్రజలు, కష్టజీవులు, అణగారిన కులాల వారు తీవ్ర నిర్బంధానికీ, దోపిడీకి గురవుతూ ఉండేవారు. ప్రజాబాహుళ్యం మాట్లాడే తెలుగు భాష, అందులో వచ్చిన సాహిత్యం కూడా అణచివేతకు గురయ్యేవి. ఈ సాంస్కృతిక దాడికి వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ ఉద్యమించింది. ‘భూమి కోసం’, ‘భుక్తి కోసం’, ‘అణచివేత నుంచి విముక్తి కోసం’ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన రైతాంగం గొప్ప ప్రజా ఉద్యమం నిర్వహించింది. జూలై 4, 1946న దొడ్డి కొమరయ్య అమరత్వం ఆ పోరుకు నాందీ వాచకం కాగా, ముగింపు అక్టోబర్ 21, 1951న జరిగింది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల లో ప్రధానంగా పోరాటం జరిగినప్పటికీ మిగిలిన తెలంగాణ ప్రాంతాలలో కూడా ఎన్నో త్యాగాలు జరిగాయి. నాలుగు వేలకు పైగా యోధులు అసువులు బాశారు. నిర్బంధాలకూ, చిత్రహిం సలకు ఇక లెక్కలేదు. తెలంగాణ ఆడపడుచులు పురుషులతో పాటు పోరు బాట పట్టి వారితో సమంగా ఇక్కట్లు అనుభవించారు. నిజాం సైన్యాలే కాక, నెహ్రూసైన్యాలు, భూస్వాముల తొత్తులవల్ల కూడా స్త్రీలు అవమానాలకు, అరాచకాలకు గురయ్యారు. కానీ వారి పోరాటం ఫలితంగానే భూమి సమస్య ఎజెండాగా ముందుకు వచ్చింది. కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో పది లక్షల ఎకరాలను పేద రైతులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ‘దొరలు’ గడీలు కూడా విడిచిపెట్టి హైదరాబాద్ నగరానికి బతుకుజీవుడా అనుకుంటూ పోయారు. కాల్మొక్కుత భాం చన్ అన్న గొంతులే, గోల్కొండ ఖిల్లా కింద నీ గోరీ కడతామని హెచ్చరించేందుకు ఉద్యమం ధైర్యమిచ్చింది. నవాబును, ఆయన తాబేదార్లను, గూండాలను ఆ పోరాటమే చావుదెబ్బ తీసింది. కేవలం సెప్టెంబర్ 13 నుంచి ఆరంభమైన పోలీసు చర్యతో నాలుగు రోజులలోనే నిజాం లొంగి పోయాడంటే, అప్పటికే ఆయన బలహీనపడ్డాడన్నమాట. 1952-1956 మధ్య జరిగిన అనేక పరిణామాల మధ్య తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలు కలిపి ఆంధ్రప్రదే శ్‌గా అవతరించాయి. పాలకుల నిర్లక్ష్యం, తెలంగాణ పట్ల వివక్ష వల్ల ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఆరంభమైంది. అప్పటికే చీలిక వచ్చినప్పటికీ 1969లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో జరిగిన ఉద్యమ సమయంలో కమ్యూనిస్టులు రాష్ట్ర సమైక్యతకు కృషి చేశారు. ఆ సమయంలోనే భీమిరెడ్డి నరసింహారెడ్డి (నాటి శాసనసభ్యుడు) సభలోనే ‘‘చెన్నారెడ్డీ! నువ్వు పొట్టకూటి కోసం ఆంధ్ర నుంచి వచ్చిన కూలీలను, చిరుద్యోగులను హైదరాబాద్ నుంచి తరిమివేస్తానంటున్నావు. అలాగే చెయ్యి! ఈ సమయంలో మేం (కమ్యూనిస్టులం) గ్రామాలలో తిరిగి ప్రవేశించి భూస్వాములను, దొరలను తరిమికొడతాం!’’ అని గర్జించాడు. 1857 నాటి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం తరువాత చరిత్రలో పేర్కొనదగినది తెలంగాణ సాయుధ పోరాటం. (నేడు తెలంగాణ విముక్తి దినోత్సవం సందర్భంగా...)