
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. బాండ్ల అమ్మకాల ద్వారా రుణాలు తీసుకోవడం ప్రభుత్వ దివాలాకోరు తనానికి నిదర్శనమన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పలు పథకాల పేరిట అప్పులు తెస్తోందని, ఇప్పటికే ఉన్న అప్పులకు తోడుగా కొత్త అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తోందన్నారు. ప్రస్తుతం రూ.2 లక్షల కోట్ల మేర అప్పులున్నాయని, ఆదాయ వృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు చర్యలు తీసుకోవల్సిన ప్రభుత్వం.. అప్పుల వైపు దృష్టి పెట్టి రాష్ట్ర ప్రజలపై మరింత భారం మోపుతోందన్నారు.