
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్‌పై పోరాడాలంటే వామపక్షాల మద్దతు ఎంతో అవసరమని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. మల్కాజ్‌గిరి కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థిగా రేవంత్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. మల్కాజ్‌గిరి పరిధిలో సీపీఐ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, తన గెలుపునకు సహరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డిని ఆయన కోరారు. సీపీఐ సహకరిస్తే అక్కడి నుంచి తప్పకుండా విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం మఖ్థుం భవన్‌లో చాడతో, రేవంత్ భేటీ అయ్యారు. టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు తనకు సహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తెరపైకి కాంగ్రెస్ కొత్త ముఖాలు
రేవంత్ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన చాడ.. ఆయన విజయానికి తమవంతు కృషి చేస్తామని ప్రకటించారు. బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలను ఓడించాడనికి లౌకిక శక్తులకు మద్దతు తెలుపుతామని చాడ వెంకట్ రెడ్డి తెలిపారు.
గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్ వ్యూహాలు