Malkajgiri Lok Sabha
-
ఎమ్మెల్యేగా ఓడి ఎంపీగా గెలిచి..
సాక్షి, హైదరాబాద్: శాసనసభ్యుడిగా పోటీచేసి ఓటమి చవిచూశాక, మళ్లీ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగి ఎంపీలుగా గెలిచి సంచలనం సృష్టించిన వారి సంఖ్య ఈ సారి పెరిగింది. తాజాగా ప్రకటించిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో.. బీజేపీ నుంచి ఏకంగా నలుగురు ఎంపీలుగా గెలుపొందారు. 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్ల నుంచి పోటీ చేసి ఓడి, పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా ఈటల రాజేందర్, అప్పటికే ఎమ్మెల్యేగా ఉన్న రఘునందన్‌రావు శాసనసభ ఎన్నికల్లో ఓడి మళ్లీ జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ నుంచి విజయం సాధించారు. అదేవిధంగా అప్పటికే సిట్టింగ్ ఎంపీలుగా ఉంటూ అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బండి సంజయ్, కోరుట్ల నుంచి ధర్మపురి అరి్వంద్ ఓటమి చెందాక పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి సంజయ్, నిజామాబాద్ నుంచి అరి్వంద్ ఎంపీలుగా గెలుపొంది సత్తా చాటారు. అలాగే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేట నుంచి ఓడిన బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచి మొదట కేంద్రహోంశాఖ సహాయ మంత్రి, ఆ తర్వాత కేంద్రమంత్రిగా ఆయన ప్రమోషన్ పొందారు. తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ సికింద్రాబాద్ నుంచి కిషన్‌రెడ్డి విజయం సాధించారు. ఇదే ఒరవడిలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఓడిన కాంగ్రెస్‌నేత, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి, ఆ వెంటనే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి రేవంత్‌రెడ్డి గెలిచి ముఖ్యమంత్రి అయిన విషయం తెలిసిందే. అదేవిధంగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడి ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎంపీగా విజయం సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం రేవంత్‌రెడ్డి కేబినెట్లో ఆయన మంత్రిగా కొనసాగుతున్న సంగతి విదితమే. -
మల్కాజిగిరిలో ఈటల ఘన విజయం
మల్కాజిగిరి: మల్కాజిగిరిలో బీజేపీ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్.. కాంగ్రెస్ అభ్యర్థి సునితా మహేందర్‌రెడ్డిపై 3.86 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచి ఈటల స్పష్టమైన ఆధిక్యం కనబరిచారు. దీంతో కాంగ్రెస్ పార్టీ.. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింంది. గత ఎన్నికల్లో స్థానంలో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి గెలుపొందిన విషయం తెలిసిందే. -
Malkajgiri Lok Sabha: మల్కాజిగిరి మాదే...
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిట్టింగ్ స్థానం.. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఈటల రాజేందర్ .. అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ విజయం.. ఇలా విభిన్నమైన రాజకీయ సమీకరణాలతో అందరి దృష్టి ఆకర్షిస్తోంది మల్కాజిగిరిలోక్ సభ నియోజకవర్గం. ఎంతో మంది రాజకీయ నాయకుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసిన చోట జిల్లాపరిషత్ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాలు సాధించిన పట్నం సునీతా మహేందర్ రెడ్డి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.. సీఎం రేవంత్‌రెడ్డి సిట్టింగ్ స్థానం నుంచి పోటీచేయడానికి అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నాను. మరో మారు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని సీఎం చాలెంజ్‌గా తీసుకున్నారు. గతంలో ఆయన విజయానికి పనిచేసిన నేతలు, కేడర్ అంతా కలిసికట్టుగా ఏకతాటిపై పనిచేస్తున్నారు. తెలంగాణ సమాజం రేవంత్‌రెడ్డిని గట్టిగా నమ్ముతోంది. సానుకూల వాతావరణం ఉంది.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పదేళ్ల పాటు జిల్లాపరిషత్ అధ్యక్షురాలిగా పనిచేశాను. ప్రతి మండలం, గ్రామ స్థాయిలో పారీ్టలతో సంబంధం లేకుండా అన్ని వర్గాలల అభివృద్ధికి నిధులు అందించాను. ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు, నాయకులు బ్రహ్మరథం పడుతున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నుంచి నాయకులు, కార్యకర్తలు భారీగా పారీ్టలో చేరుతున్నారు. తోటి మహిళను గెలిపించుకుంటామని మహిళలంతా స్వతహాగా ముందుకొస్తున్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉంది. మహేశ్వరం, ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే ఎల్బీ నగర్ నియోజకవర్గంలో నివాస గృహాలు మునిగిపోతున్నాయి. తక్షణం వరద సమస్య పరిష్కరించడానికి సీఎం సానుకూలంగా ఉన్నారు. ఉప్పల్, మేడ్చల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి నియోజకవర్గాలో ట్రాఫిక్, ఇతర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మూసీ పరివాహక ప్రాంతంలో శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మల్కాజిగిరి నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టో తయారు చేశాం. ఆ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం.. బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య చీకటి ఒప్పందం నడుస్తోంది. మాజీ మంత్రి మల్లారెడ్డి బీజేపీ అభ్యర్థి రాజేందర్ మ«ధ్య జరిగిన సంభాషణే ఇందుకు సాక్ష్యం. బయట ఎన్ని మాటలు మాట్లాడినా లోలోపల వాళ్లంతా ఒక్కటే. ఎన్నికల సమయంలో పరస్పర అవగాహనతోనే ముందుకెళుతున్నారు.మోసపూరిత వాగ్దానాలను ప్రజలు నమ్మరు.. ఎన్నికలు అనగానే రాజకీయ పారీ్టలు రకాల హామీలతో ప్రజల ముందుకొస్తారు. గతంలో ఈ ప్రాంతంలో వరదలు వచ్చినపుడు అప్పటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండిపోతే బండి ఇస్తామన్నారు. ఒక్కరినీ ఆదుకున్న పాపాన పోలేదు. ఇలాంటివి ఎన్నో హామీలు గాలికి వదిలేశారు. అందుకే ఈ సారి బీజేపీని నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. ఈటల రాజేందర్ ఇక్కడి ప్రజలకు కొత్త. స్థానిక సమస్యలపై ఆయనకు అవగాహన లేదు. బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో నమ్మకం పోయింది. అందుకే ఆ పార్టీ తరపున పోటీ చేయడానికే ఎవరూ ముందుకు రాలేదు.ఉప్పల్, ఎల్బీ నగర్లో ఐటీ అభివృద్ధి చేస్తాం. ఉప్పల్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో ఐటీ అభివృద్ధి చేస్తాం. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జేఈఈ, నీట్, క్యాట్ శిక్షణ తగతులు ఏర్పాటు చేస్తాం. మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాల కల్పనకు తగిన చర్యలు తీసుకుంటాం. ట్రాఫిక్ ఇబ్బందులు తీర్చేందుకు పై వంతెనలు (ఫ్లై ఓవర్ బ్రిడ్జ్) నిర్మాణం, అంతర్గత రహదారులు, కాలుష్య నివారణకు తగిన చర్యలు తీసుకోవడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తాం. -
రంగారెడ్డి జిల్లా.. విభిన్నతల ఖిల్లా!
సాక్షి, హైదరాబాద్: పల్లె.. పట్నం కలబోత. భౌగోళికంగా ఏడు జిల్లాల సరిహద్దులతో విస్తరించి ఉన్న అరుదైన ఘనత. తెలంగాణలోనే శరవేగంగా విస్తరిస్తోంది రంగారెడ్డి జిల్లా. ఐటీ, పారిశ్రామిక, రియల్ ఎస్టేట్ రంగాల్లో దూసుకుపోతోంది. జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఈ జిల్లా ప్రస్తుతం కొంత విభిన్న పరిస్థితులను ఎదుర్కొంటోంది. తెలంగాణలోనే కాదు.. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రంగారెడ్డి జిల్లా అయిదు లోక్‌సభ స్థానాల పరిధిలో విస్తరించి ఉండటం.. ఇటు రాజకీయంగానే కాదు అటు పరిపాలనా పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం ఒక్కో లోక్‌సభ స్థానం పరిధిలో కొనసాగుతుండటంతో ఎన్నికల రిటరి్నంగ్ అధికారులకే కాదు, పోలీసు యంత్రాంగానికి కొత్త చిక్కులు తప్పడం లేదు. దేశంలోనే మొదటి స్థానంలో మల్కాజిగిరి.. దేశంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న జాబితాలో మల్కాజిగిరి మొదటిస్థానంలో ఉంది. మల్కాజిగిరి. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, కంటోన్మెంట్, మేడ్చల్ సహా జిల్లాలోని ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఇదే పార్లమెంట్ పరిధిలో కొనసాగుతోంది. ఇక్కడ మొత్తం 37,28,417 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఎల్బీనగర్ ఓటర్లే 6,00,552 మంది ఉండటం విశేషం. అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించడంలో జిల్లా పరిధిలోని ఎల్బీనగర్కు చెందిన ఓటర్లే కీలక పాత్ర పోషించబోతున్నారు. తెలంగాణలో చేవెళ్ల రెండోది.. తెలంగాణలో అత్యధిక ఓటర్లు ఉన్న రెండో అతిపెద్ద లోక్‌సభ స్థానంగా చేవెళ్లకు గుర్తింపు ఉంది. వికారాబాద్, పరిగి, తాండురు సహా రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజక వర్గాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ మొత్తం 29,19,465 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో చేవెళ్ల, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లికి చెందిన వారే 21,72,811 మంది ఓటర్లు ఉండటం గమనార్హం. అక్కడి అభ్యర్థులు..ఇక్కడి ఓటర్లు రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం భువనగిరి లోక్‌సభ స్థానం పరిధిలో కొనసాగుతోంది. ఈ లోక్‌సభ స్థానంలో 18,04,930 మంది ఓటర్లు ఉండగా, వీరిలో ఒక్క ఇబ్రహీంపట్నంలోనే 3,37,134 మంది ఓటర్లు ఉన్నారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధిక ఓటర్లు ఇక్కడే ఉండటం, అభ్యర్థుల గెలుపోటములు వీరిపైనే ప్రధానంగా ఆధారపడ్డాయి. ⇒ జిల్లాలోని కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నాగర్‌కర్నూల్ లోక్‌సభ పరిధిలో కొనసాగుతోంది. ఈ లోక్‌సభ స్థానంలో మొత్తం 17,34,773 మంది ఓటర్లు ఉండగా, వీరిలో కల్వకుర్తికి చెందిన వారు 2,43,098 మంది ఉన్నారు. ⇒ షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం పరిధిలో కొనసాగుతోంది. ఈ స్థానంలో 16,80,417 మంది ఓటర్లు ఉండగా, వీరిలో షాద్‌నగర్ ఓటర్లే 2,38,392 మంది ఉన్నారు. ఆయా పారీ్టల అభ్యర్థుల జయాపజయాలను జిల్లా ఓటర్లే నిర్దేశించనున్నారు. -
అత్యుత్సాహం అరెస్ట్‌కు దారితీసింది
సాక్షి, హైదరాబాద్: ఓ పోలింగ్ ఏజెంట్ ప్రదర్శించిన అత్యుత్సాహం అతని అరెస్ట్‌కు దారి తీసింది. నిబంధనలకు విరుద్ధంగా ఈవీఎంలు, వీవీప్యాట్లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌లో ఫొటో దిగడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. టీఆర్ఎస్ మల్కాజ్గిరి లోక్‌సభ అభ్యర్థి మర్రి రాజశేఖరరెడ్డికి ఆ పార్టీకి చెందిన నాయకుడు వెంకటేశ్ పోలింగ్ ఏజెంట్‌గా ఉన్నారు. అయితే గురువారం పోలింగ్ ముగిశాక అధికారులు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్లను భోగారంలోని హోలీమేరి కళాశాలలో భద్రపరిచారు. అయితే పోలింగ్ ఏజెంట్‌గా అధికారులతో కలిసి అక్కడికి వెళ్లిన వెంకటేశ్ స్ట్రాంగ్ రూమ్‌లోని ఈవీఎంలు, వీవీప్యాట్ల వద్ద నిలుచుని ఫొటో దిగారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై కీసర పోలీసులకు ఫిర్యాదు రావడంతో అతనిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. కాగా, వెంకటేశ్‌పై క్రిమినల్ కేసు నమోదైనట్టు కీసర సీఐ నరేందర్‌గౌడ్ తెలిపారు. -
నేను గెలవాలంటే వారి మద్దతు కావాలి: రేవంత్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్పై పోరాడాలంటే వామపక్షాల మద్దతు ఎంతో అవసరమని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. మల్కాజ్గిరి కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థిగా రేవంత్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. మల్కాజ్గిరి పరిధిలో సీపీఐ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, తన గెలుపునకు సహరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డిని ఆయన కోరారు. సీపీఐ సహకరిస్తే అక్కడి నుంచి తప్పకుండా విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం మఖ్థుం భవన్లో చాడతో, రేవంత్ భేటీ అయ్యారు. టీఆర్ఎస్ను ఓడించేందుకు తనకు సహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెరపైకి కాంగ్రెస్ కొత్త ముఖాలు రేవంత్ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన చాడ.. ఆయన విజయానికి తమవంతు కృషి చేస్తామని ప్రకటించారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలను ఓడించాడనికి లౌకిక శక్తులకు మద్దతు తెలుపుతామని చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ వ్యూహాలు -
ఆ సీటుపైనే బాబు, పవన్, కేసీఆర్, జేపీల చూపు!
వారణాసి లోకసభ స్థానంపై దేశవ్యాప్తంగా దృష్టి పడింది. ఎందుకంటే వారణాసి నుంచి బీజేపీ అభ్యర్థి నరేంద్రమోడీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రివాల్ లు పోటికి నిలవడంతో ఆస్థానంపై ఆసక్తి పెరిగింది. అలానే తెలంగాణ ప్రాంతంలోని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్ గిరి స్థానం ఈసారి ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా మారింది. అందుకు కారణం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖరరావు, జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్, లోకసత్తా వ్యవస్థాపకుడు ఎన్ జయప్రకాశ్ నారాయణ్ పోటికి ఆసక్తి చూపడమే. గతంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కుమారుడు లోకేష్ ను బరిలోకి దించాలని అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు భావించిన ఎందుకనో వెనుకంజ వేశారు. టీడీపీ తరపున ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర్ రావులు కూడా బరిలో దిగేందుకు తహతహలాడారు. అయితే ప్రస్తుత రాజకీయ వాతావరణంలో చంద్రబాబు, కేసీఆర్, పవన్ కళ్యాణ్, జేపీల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ లోకసభ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అయితే తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఈ నియోజకవర్గంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఓటర్లు ఉండటంతో పలు నాయకులు ఈ సీటుపై కన్నేశారు. కూకట్ పల్లి, మల్కాజిగిరి, ఎల్ బీ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్ ఇతర స్థానంలో అత్యధికంగా తెలంగాణేతర ఓటర్లు ఉన్న కారణంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జేపీలు మల్కాజ్ గిరి నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారు. సిట్టింగ్ ఎంపీ సర్వే సత్యనారాయణ మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ కు షిఫ్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సర్వే స్థానంలో రాహుల్ గాంధీని పోటీ చేయించాలని స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆలోచన చేస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో మల్కాజిగిరి లోకసభ స్థానం నుంచి ఎవరు బరిలో ఉంటారో అనే విషయం కొద్ది రోజులాగితే స్పష్టమవ్వడం ఖాయం.