సాక్షి, హైదరాబాద్: విధుల్లో చేరేందుకు ఆర్టీసీ జేఏసీ నిర్ణయించినందున రాష్ట్ర ప్రభు త్వం కూడా సానుకూల దృక్పథంతో వ్యవహ రించాలని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. దాదాపు 3 నెలలుగా జీతాలు లేకున్నా ఆర్టీసీ కార్మికులు అద్భు త పోరాట పటిమ ప్రదర్శించి సమ్మెను కొనసాగించడం అభినందనీయమన్నారు. హైకోర్టు ఆదేశాలను గౌరవించి కార్మికులు సమ్మె విరమించిన నేపథ్యంలో ప్రభుత్వం వారిని విధుల్లోకి తీసుకుని ఉదారత చాటాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment