
సాక్షి, హైదరాబాద్: తామర పురుగుతో తీవ్రంగా నష్టపోయిన మిరప రైతులకు ఎకరాకు రూ.లక్ష నష్ట పరిహారం ఇవ్వాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి బుధవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ఖమ్మం, మహబూబ్‌నగర్, సూర్యాపేట, వరంగల్, నల్లగొండ, కరీంనగర్, సిద్దిపేట తదితర జిల్లాల్లో వేసిన మిరప తోటలను వారం రోజుల్లోనే తామర పురుగు సర్వ నాశనం చేశాయని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా తామర పురుగుతో ఎన్ని ఎకరాల్లో నష్టం వాటిల్లిందో అధికారులతో సర్వే చేయించి, రైతులను ఆదుకోవాలని చాడ కోరారు.