సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో ఆదివారం తిరుపతిలో జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు బదులు రాష్ట్రం తరఫున ప్రతినిధిగా హోంమంత్రి ఎం.మహమూద్ అలీ హాజరు కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శిసోమేశ్‌కుమార్ కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7.30 గంటల వరకు జరగనున్న ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళినాడు, కేరళ ముఖ్యమంత్రులు, పుదుచ్చేరి సీఎం, లెఫ్టినెంట్ గవర్నర్, అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్లు పాల్గొననున్నారు. కేంద్రం–రాష్ట్రాల మధ్య సంబంధాలు, సహకార సమాఖ్య విధానం అమలు, రాష్ట్రాల మధ్య వివాదాలు, సమస్యలను ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలు, నీళ్ల పంపకాలు, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలు, విద్యుత్ బకాయిలు వంటి అంశాలను ఇరు రాష్ట్రాలు ఈ సమావేశంలో ప్రస్తావించి తమ వాదనలు వినిపించే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment