పెర్కిట్(ఆర్మూర్): తెలంగాణలో చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన 90 శాతం పూర్తయ్యిందని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ పేర్కొన్నారు. ఆదివారం ఆయన అటవీ శాఖ మంత్రి జోగు రామన్నతో కలిసి ఆదిలాబాద్ వెళ్తూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లిలో గల ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంలో విలేకరులతో మాట్లాడారు.
సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ సాధన కోసం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారన్నారు. నిజామాబాద్ జిల్లాలో రికార్డుల ప్రక్షాళన పూర్తికావచ్చిందన్నారు. రాష్ట్రంలో ముస్లింల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మహమూద్ అలీ పేర్కొన్నారు. ఇప్పటివరకు 23 వేల మంది షాదీ ముబారక్ ద్వారా లబ్ధి పొందారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment