హోం మంత్రి అలీతో డీజీపీ అంజనీకుమార్‌ భేటీ  | DGP Anjani Kumar Met Home Minister Mahmood Ali | Sakshi
Sakshi News home page

హోం మంత్రి అలీతో డీజీపీ అంజనీకుమార్‌ భేటీ 

Published Mon, Jan 2 2023 2:00 AM | Last Updated on Mon, Jan 2 2023 8:47 AM

DGP Anjani Kumar Met Home Minister Mahmood Ali - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని కొత్త డీజీపీ అంజనీకుమార్‌ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌అలీని ఆయన అధికార నివా­సంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాన్ని ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ సైతం హోం మంత్రిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్ష­లు తెలిపారు. రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యద­ర్శిగా బాధ్యతలు తీసుకున్న జితేందర్, ఏసీబీ నూతన డీజీపీ రవిగుప్తా సైతం మహ­మూద్‌అలీని ఆయన నివాసంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement