
సాక్షి, హైదరాబాద్: రాబోయే ఎన్నికల్లో వంద స్థానాలు టీఆర్‌ఎస్‌వే అని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఆశాభావం వ్యక్తం చేశారు. అభివృద్ధికి బంగారు బాటలు వేస్తూ రాష్ట్రాన్ని విజయ తీరాల వైపు నడిపిస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని మంగళవారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలో తిరిగి గులాబీ జెండా ఎగరవేయడం ఖాయమని పేర్కొన్నారు. దేశంలో ఏ సీఎం చేయని విధంగా కేసీఆర్ వ్యవసాయ అభివృద్ధి కోసం అనేక వినూత్న సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి అనతికాలంలోనే యావత్తు దేశ దృష్టిని ఆకర్షించారని తెలిపారు. నిజాం పాలనలో భూసర్వే తర్వాత రాష్ట్రంలో పాలించిన ఏ ప్రభుత్వం చేయని విధంగా కేసీఆర్ రెవెన్యూ అధికారులతో చర్చించి సమగ్ర భూప్రక్షాళన సర్వేకు నాంది పలికారని గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment