మహమూద్ అలీ
సాక్షి, హైదరాబాద్: ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లకు సంబంధించిన అం శంపై స్టే కొనసాగాలని రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షిస్తోందని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశా రు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పనకు కట్టుబడి ఉందని, విచారణ కమిషన్ నివేదిక కోసం ఎదురు చూస్తోందన్నారు.
అప్పటివరకు నాలుగు శాతం రిజర్వేషన్‌పై స్టే కొనసాగితే, ముస్లింలకు విద్యా, ఉద్యోగాల్లో లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ రిజర్వేషన్‌పై ఈ నెల 18న సుప్రీంకోర్టులో జరిగే విచారణకు తాను హాజరుకానున్నట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తే కోర్టు స్టే విధించిందన్నారు. ప్రస్తుతం కేసు సుప్రీంకోర్టులో ఉన్నం దున రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అదనపు న్యాయవాదిగా రాంచందర్‌రావును ని యమించినట్లు పేర్కొన్నారు.
ముస్లిం రిజర్వేషన్‌పైస్టే కొనసాగాలి
Published Sat, Apr 16 2016 2:41 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement
Advertisement