లబ్ధిదారుడికి ఆటో తాళాన్ని అందిస్తున్న ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు పద్మారావుగౌడ్, నాయిని. చిత్రంలో రాజాసింగ్, దేవీప్రసాద్, అకున్ సబర్వాల్
సాక్షి, హైదరాబాద్: గుడుంబారహిత రాష్ట్రంగా తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. హైదరాబాద్‌లోని ధూల్‌పేటలాంటి ప్రాంతంలో గుడుంబా నిర్మూలన అంటే ఆషామాషి వ్యవహారం కాదన్నారు. ఈ ఘనత సాధించిన ఎక్సైజ్ అధికారులను ఆయన అభినందించారు.
సోమవారం ఆయన హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎక్సైజ్ మంత్రి పద్మారావుగౌడ్‌తో కలసి పీపుల్స్ ప్లాజాలో గుడుంబా వృత్తి మానేసిన వారికి ఆటోలను పంపిణీ చేశారు. మంత్రి పద్మారావు మాట్లాడుతూ రాష్ట్రంలో వందశాతం గుడుంబా నిర్మూలించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్, ఎౖMð్సజ్ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment