త్వరలో 20 వేల పోలీసు ఉద్యోగాల భర్తీ | 20000 Police Jobs To Be Filled Soon In Telangana | Sakshi
Sakshi News home page

త్వరలో 20 వేల పోలీసు ఉద్యోగాల భర్తీ

Oct 24 2020 2:00 AM | Updated on Oct 24 2020 9:11 AM

20000 Police Jobs To Be Filled Soon In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో దాదాపు 20వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామని హోంమంత్రి మహమూద్‌ అలీ తెలిపారు. నగరంలోని తెలంగాణ పోలీస్‌ అకాడమీ (టీఎస్‌పీఏ)లో శుక్రవారం 12వ బ్యాచ్‌కు చెందిన 1,162 మంది సబ్‌– ఇన్‌స్పెక్టర్ల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 18,428 మంది ఎస్‌ఐ, కానిస్టేబుళ్ల నియా మకం జరిపామని, ఇంకా ఖాళీగా ఉన్న పోలీసు ఉద్యోగాలను కూడా నియ మించేందుకు చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. డీజీపీ ఎం.మహేందర్‌ రెడ్డి మాట్లాడుతూ నిజాయితీ, నిబద్ధతతో పని చేస్తూ సాంకేతికతను విరివిగా ఉపయోగిం చడం ద్వారా స్మార్ట్‌ పోలీసింగ్‌కు ప్రాధాన్యత నివ్వాలని సూచించారు. పోలీస్‌ అకాడమీ ఇంచార్జ్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ అకాడమీ ద్వారా ఇప్పటివరకు 1,25,848 మంది వివిధ ర్యాంకులకు చెందిన వారికి శిక్షణనిచ్చామని తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement