నిధులు సద్వినియోగం చేసుకోవాలి
ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ
మైనారిటీ సంక్షేమశాఖ అధికారులతో సమీక్ష
హైదరాబాద్: మైనారిటీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించనున్న వెయ్యికోట్ల రూపాయలను సద్వినియోగం చేసుకోడానికి పకడ్బందీ ప్రణాళిక తయారు చేయాలని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ అధికారులను ఆదేశించారు. మైనారిటీల సంక్షేమశాఖ, వక్ఫ్‌బోర్డు, ఉర్దూ అకాడమీల పనితీరుపై శనివారం సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో మైనారిటీ సంక్షేమ శాఖ, వక్ఫ్ బోర్డు, ఉర్దూ అకాడమీల్లో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.
ఆయా విభాగాల్లో ఖాళీల భర్తీతోపాటు, జిల్లాస్థాయిలో కార్యాలయ భవనాలు నిర్మించాలనే యో చనలో ప్రభుత్వం ఉందన్నారు. ముస్లిం యువతుల వివాహాలకు రూ.51 వేల ఆర్థిక సహాయా న్ని అందిస్తామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై భారీ స్పందన వస్తోందన్నారు. భూముల పరిరక్షణకు వక్ఫ్‌బోర్డుకు కార్యనిర్వాహక అధికారాలు అప్పగిస్తామన్నారు. ఈ సమావేశంలో మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్, వక్ఫ్‌బోర్డు సీఈఓ జలాలుద్దీన్ అక్బర్, తెలంగాణ హజ్ కమిటీ ప్రత్యేకాధికారి, ఉర్దూ అకాడమీ సీఈఓ షుకూర్ అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.