ఆగస్టు 17 నుంచి హజ్‌యాత్ర | August 17 hajyatra | Sakshi
Sakshi News home page

ఆగస్టు 17 నుంచి హజ్‌యాత్ర

Published Mon, Jan 19 2015 1:52 AM | Last Updated on Sat, Sep 2 2017 7:52 PM

August 17 hajyatra

సాక్షి, హైదరాబాద్: పవిత్ర హజ్‌యాత్ర-2015కు తెలంగాణ హజ్ కమిటీ సిద్ధమైంది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ హజ్‌హౌస్‌లో  సోమవారం ఉదయం 11.30 గంటలకు దరఖాస్తుల జారీ ప్రక్రియను ప్రారంభించి షెడ్యూలు  విడుదల చేయనున్నారు. ఈ యాత్ర కోసం పూర్తి చేసిన దరఖాస్తులను సోమవారం నుంచి  ఫిబ్రవరి 20 వరకు స్వీకరించనున్నారు.

ఈసారి కొత్తగా ‘ఆన్‌లైన్’లో దరఖాస్తుల స్వీకరణ, ఈ-పేమెంట్ సదుపాయం కల్పించారు. దరఖాస్తులను www.hajcommittee.comవెబ్‌సైట్‌కు పంపవచ్చు. అదేవిధంగా ఈ పేమెం ట్‌ను ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించవచ్చు. అంతర్జాతీయ పాస్‌పోర్టు కలిగి 2016 మార్చి, 20వ తేదీ వరకు గడువు ఉన్నవారే హజ్‌యాత్ర కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. రిజర్వుడ్ కేటగిరి కింద 70 ఏళ్ల వయస్సు పైబడినవారు, నాలుగు పర్యాయాలు దరఖాస్తు చేసుకొని ఈ యాత్రకు ఎంపిక కానీ వారిని పరిగణనలోనికి ఏ, బీ కేటగిరీలుగా తీసుకుంటారు.   
 
మార్చిలో యాత్రికుల ఎంపిక: హజ్‌యాత్ర కోసం దరఖాస్తు చేసుకున్నవారి ఎంపిక మార్చి రెండోవారంలో జరగనుంది. రాష్ట్రానికి కేటాయించి కోటాను జిల్లా ముస్లిం జనాభావారీగా విభజించి లాటరీ పద్ధతిలో ఎంపికను నిర్వహిస్తారు. ఎంపికైనవారు తమ ఒరిజినల్ పాస్‌పోర్టుతోపాటు పే స్లిప్‌లను ఏప్రిల్ 23లోగా సమర్పిం చాల్సి ఉంటుంది. ఆగస్టు 17న హజ్‌యాత్ర కోసం తొలి ఫ్లైట్ బయలుదేరనుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement