
సాక్షి, హైదరాబాద్: ‘భారత యూనియన్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనం అయిన నేడు.. ఆనాటి పోరాటంలో అసమాన త్యాగాలు చేసిన వీరులను స్మరించుకుందాం’అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు పిలుపునిచ్చారు. భారత యూనియన్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనం సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఉదయం తెలంగాణ భవన్‌కు చేరుకున్న ఆయన తొలుత తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం టీఆర్‌ఎస్ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులరి్పంచారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు నాయిని నర్సింహారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తాను పాల్గొన్న కార్యక్రమ వివరాలతో ‘జై తెలంగాణ.. జై హింద్’అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment