పేద యువతులకు ‘షాదీ ముబారక్’
హెల్ప్ లైన్ ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి మహమూద్
సుల్తాన్‌బజార్: పేద యువతులకు ‘షాదీ ముబారక్’ పథకం వరం లాంటిదని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. సోమవారం అబిడ్స్ తిలక్‌రోడ్‌లోని బీమాభవన్‌లో ఉన్న కమిషనర్ మైనార్టీ వెల్ఫేర్ కార్యాలయంలో షాదీ ముబారక్ మద్దత్ హెల్ప్‌లైన్ (040-246760452)ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మహామూద్‌అలీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముస్లిం, సిక్కు, క్రిస్టియన్ మైనారిటీ, బౌద్ధ తదితర మైనార్టీలకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు.
పెళ్లికి నెల రోజుల ముందు మీసేవ, ఆన్‌లైన్ ద్వారా- epasswebsite.cgg.gov.in వెబ్‌సైట్‌లో షాదీ ముబారక్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. యువతులు జోరో బ్యాలెన్స్‌తో ఖాతా తెరుచుకోవాల్సి ఉంటుందని వివరించారు. అక్టోబర్ 2 తర్వాత పెళ్లి అయిన వారు పెళ్లి సర్టిఫికెట్ సమర్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మైనార్టీ వెల్ఫేర్ డెరైక్టర్ ఎంజె. అక్బర్, డిప్యూటీ డెరైక్టర్ సుభాష్ చందర్‌గౌడ్, నవీన్ నికోలేస్( క్రిస్టియాన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్), శుకూర్( మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్)తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.