టీఆర్‌ఎస్‌తోనే మైనార్టీల అభివృద్ధి | Minorities development with TRS | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌తోనే మైనార్టీల అభివృద్ధి

Published Tue, Oct 23 2018 3:10 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Minorities development with TRS - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న మహమూద్‌ అలీ

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): టీఆర్‌ఎస్‌ హయాంలోనే మైనార్టీలు అభివృద్ధి చెందారని ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. మహబూబ్‌నగర్‌లో సోమవారం ఆయన మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. మైనార్టీలను కాంగ్రెస్‌ మొదటినుంచి మోసం చేసిందని, సెక్యులర్‌ పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్‌ హయాంలోనే బాబ్రీ మసీద్‌ కూల్చివేత ఘటన జరిగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన టీడీపీతో ఎలా పొత్తు పెట్టుకుంటున్నారని అలీ ప్రశ్నించారు.

తెలంగాణను మరోసారి మోసం చేసేందుకు ఈ పొత్తులని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ 204 కేసులను వేసిన విషయాన్ని ప్రజలు గుర్తించి ఆ పార్టీకి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కోరారు. రైతుల కోసం తాము బడ్జెట్‌లోనే రూ.12 వేల కోట్లు కేటాయించామని వివరించారు. పెట్టుబడి సాయంగా ఎకరానికి రూ.8 వేలు ఇస్తున్న తాము మరోసారి గెలిస్తే రూ.10 వేలు ఇవ్వనున్నట్లు మహమూద్‌ అలీ ప్రకటించారు. అంతకుముందు ఆయన టీఆర్‌ఎస్‌ మైనార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌ నాయకులు రషీద్‌ఖాన్, మక్సూద్, మోసీన్‌ఖాన్, ఇఫ్తెకార్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement