
సాక్షి, హైదరాబాద్: మహిళలను వేధిస్తున్న వారిపై షీ టీమ్స్ ఆధ్వర్యంలో 8,055 కేసులు నమోదు చేసినట్లు హోం మంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. ఇందులో 2,554 ఎఫ్‌ఐఆర్ కేసులేనని శాసనసభకు తెలిపారు. టీఆర్‌ఎస్ సభ్యులు పద్మాదేవేందర్, గొంగిడి సునీత, రేఖా నాయక్‌లు ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో షీ టీమ్స్ పనిచేస్తున్నాయని, కొత్తగా ఏర్పడ్డ జిల్లా కేంద్రాలకు వాటిని విస్తరించినట్లు తెలిపారు. కాగా, రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతికి సంబంధించి భట్టి విక్రమార్క ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.