
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. మహమ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా పాతబస్తీలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ముస్లిం నేతల ఆందోళన నేపథ్యంలో పోలీసు బలగాలు పాతబస్తీలో మోహరించాయి.
కాగా, రాజాసింగ్ వ్యాఖ్యలపై తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ స్పందించారు. హోం మంత్రి మహమూద్ అలీ తాజాగా మీడియాతో మాట్లడుతూ.. ‘‘శాంతియుత వాతావరణాన్ని బీజేపీ కలుషితం చేస్తోంది. రాజాసింగ్ వ్యాఖ్యలతో శాంతిభద్రతల సమస్య ఏర్పడింది. బీజేపీ రౌడీయిజం చేస్తే సహించేది లేదు. బీజేపీ అయినా.. ఎంఐఎం అయినా తప్పు చేస్తే ఎవరినీ వదిలేది లేదు’’ అంటూ కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: రాజాసింగ్‌కు మరో షాక్