సాక్షి, హైదరాబాద్: స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ఎంఐఎం లేఖ రాసింది. రాజాసింగ్ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని పేర్కొంది. సెక్షన్ 41 సీఆర్‌పీసీ కింద నోటిస్ ఇవ్వలేదనే కారణంతోనే రాజాసింగ్‌కు బెయిల్ ఇచ్చారని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. చట్టప్రకారం మరోసారి రాజాసింగ్‌ను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
చదవండి: Telangana: హీటెక్కిన స్టేట్..!
హైదరాబాద్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ఉద్దేశంతోనే రాజాసింగ్ వీడియో విడుదల చేశారని అసదుద్దీన్ మండిపడ్డారు. గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలతో హైదరాబాద్‌లో సాప్ట్‌వేర్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. రాజాసింగ్‌ను అరెస్ట్ చేసి వీడియో శాంపిల్ తీసుకోవాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.
కాగా, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చెలరేగిన దుమారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా.. రాజాసింగ్‌పై సస్పెన్షన్ వేటు వేసింది బీజేపీ. మరోవైపు రాజాసింగ్ వ్యాఖ్యలపై పాతబస్తీలోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. నాటకీయ పరిణామాల తర్వాత మంగళవారం రాత్రి రాజాసింగ్‌కు బెయిల్ దక్కిన నేపథ్యంలో.. భారీగా యువత ఓల్డ్‌సిటీలో రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment