
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ శనివారం ఉదయం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ శాసనసభ నూతన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన చేత ప్రమాణం చేయించారు. గురువారం అసెంబ్లీలో జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి రాజాసింగ్ సహా మరో నలుగురు ఎమ్మెల్యేలు హాజరు కాని విషయం తెలిసిందే. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన అనంతరం మీడియా సమావేశంలో రాజాసింగ్ మాట్లాడారు.
ఎంఐఎం పార్టీ నాయకులు హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడారని, సీఎం కేసీఆర్ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్‌ను చేసినందుకు ఆలోచించాలన్నారు. బంగారు తెలంగాణ కావాలంటే అందరినీ కలుపుకొని వెళ్లాలని కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి దూరంగా ఉంటానని, హిందూ ధర్మం పట్ల వ్యతిరేకంగా ఉండే ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే, ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ముందు తాను ప్రమాణం చేయనని రాజాసింగ్ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment