హైదరాబాద్: శిథిలావస్థకు చేరితే చార్మినార్ను కూడా కూలగొడతామన్న డిప్యూటీ సీఎం మహమూద్ అలీ వ్యాఖ్యలు సరికాదని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీహెచ్ హనుమంతరావు అభిప్రాయపడ్డారు. శనివారం హైదరాబాద్లో వీహెచ్ విలేకర్లతో మాట్లాడుతూ... మహమూద్ అలీ వ్యాఖ్యలు ప్రజల భావొద్వేగాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపించారు.
చారిత్రక కట్టడాలను మరమ్మతులు చేస్తూ సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని ఆయన స్పష్టం చేశారు. కట్టడాలు పాతబడ్డాయని కూల్చివేస్తామనడం బాధ్యతారాహిత్యమే అవుతుందని వీహెచ్ అన్నారు.