
శ్రీనగర్‌కాలనీ (హైదరాబాద్): పోలీసుల సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే అత్యుత్తమమని హోంమంత్రి మహమూద్ అలీ చెప్పారు. యూసుఫ్‌గూడ పోలీస్ బెటాలియన్‌లో టీఎస్‌ఎస్‌పీ కన్వెన్షన్ సెంటర్‌ను గురువారం హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ రూ.12 కోట్లతో ఈ కన్వెన్షన్‌ను నిర్మించామని, పోలీసులతో పాటు సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు.
దీనిద్వారా వచ్చే ఆదాయాన్ని పోలీసుల సంక్షేమానికి కేటాయిస్తామని పేర్కొన్నారు. పార్కింగ్‌తో పాటు అన్ని అత్యాధునిక వసతులతో ఈ కన్వెన్షన్‌ను నిర్మించినట్టు వివరించారు. కార్యక్రమంలో ఏసీబీ డీజీ అంజనీకుమార్, అడిషనల్ డీజీపీ అభిలాష బిస్త్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment